లండన్‌లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం | Telangana Association of London 2026 Bonalu Celebrations | Sakshi
Sakshi News home page

Bonalu: లండన్‌లో వైభవంగా 'టాక్' బోనాల జాతర

Jul 28 2026 7:36 PM | Updated on Jul 28 2026 7:41 PM

Telangana Association of London 2026 Bonalu Celebrations

లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు

ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు నృత్యం

అల‌రించిన సాంస్కృతిక కార్యక్రమాలు

లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ న‌గ‌రంలోని కింగ్‌స్లే అకాడ‌మిలో జూలై 19న జ‌రిగిన ఈ వేడుకలకు బ్రిట‌న్‌ నలుమూలల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్రవాసులు కుటుంబ సభ్యులతో క‌లిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వ‌ర్యంలో ఈ సంబ‌రాలు జ‌రిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్  జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్‌ప‌ర్స‌న్‌ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

వేడుక‌ల‌కు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజ‌ర‌య్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వ‌హించారు. పోతురాజు నృత్యం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అల‌రించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు త‌మ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

టాక్ సంస్థ అధ్య‌క్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో త‌మ‌ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్ర‌శంసించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్ర‌జ‌ల కోసం తాము చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సంద‌ర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.

బోనాల‌ వేడుక‌లు విజ‌యవంతం కావ‌డం ప‌ట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్య‌క్షురాలు శుషుమ్న‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజ‌రీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. త‌మ‌కు స‌హ‌క‌రించిన వారంద‌రికీ పేరు పేరున‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుక‌లు ముగిశాయి.

పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్,  ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement