breaking news
TAUK London
-
లండన్‌లో వైభవంగా 'టాక్' బోనాల జాతర వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కుయుకే నలుమూలల నుండి సుమారు 2000కి పైగా ప్రవాసీయులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాఖ్యాతలుగా ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యవహరించారు. ముఖ్య అతిదులుగా పార్లమెంటరీ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (మైగ్రేషన్ & సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్, అతిదులుగా కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం అందరికీ బోనాలు (Bonalu) శుభాకాంక్షలు తెలిపారు. టాక్ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సంస్థను నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థ ద్వారా ఆడబిడ్డలందరు బోనాలతో సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ భవిష్యత్తు కార్యక్రమాలను ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి వివరించారు.ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తన సహకారం వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం సంతోషమన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ నవీన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు -బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానిక సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు టాక్ అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈవెంట్ స్పాన్సర్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది.ఈ కార్యక్రమంలో, పవిత్ర, సత్య చిలుముల, మట్టా రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్, నాగ్, శ్రీధర్ రావు, శైలజ,స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్వేత శ్రీవిద్య, నీలిమ, పృద్వి, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరిగౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా, తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా బోనాల జాతర వేడుకలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథులు హాజరైన ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 మందికి పైగా ప్రవాస సభ్యులు హాజరయ్యారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమానికి అధికార ప్రతినిధి హరిగౌడ్ వాఖ్యాతగా వ్యవహరించారు. సాంప్రదాయ బద్దంగా పూజలు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ఎన్నారైలను ముగ్ధులను చేశాయి. ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం పోతురాజు వేషధారణ ఆకట్టుకుంది. సందీప్ కుమార్ బుక్క బృందం పర్యవేక్షణలోనే జరిగిన పోతురాజు విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు. లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని.. టాక్ సంస్థ, టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం సేవలను కొనియాడారు. ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తొట్టెల ఊరేగింపు అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను సత్కరించి, బహుమతులందజేశారు. ఎంపీ రూత్ క్యాడ్బరి కూడా ఈ ఉత్సవాలపై సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని కోరారు. టాక్ సంస్థ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్‌కు అన్ని సందర్భాల్లో అండగా నిలుస్తున్న ఎంఎల్సీ కవితకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించు కున్నామన్నారు. టాక్ జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు సంస్థ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆమె సభకు వివరించారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు-బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షులు అశోక్ దూసరి తెలిపారు. ఈ సందర్బంగా అనిల్ కూర్మచలం కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలిపి, వారిని సత్కరించారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి మన దేశమంతా అమలు కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలంతా నినదించారు. ‘ఫ్యూచర్ కాండిడేట్ ప్రోగ్రాం ఫర్ యూకే’ ఉదయ్ నాగరాజు తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి మహాశక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది. అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి, సభ్యులు.. పవిత్ర రెడ్డి కంది, నవీన్ రెడ్డి, స్వాతి బుడగం, రాకేష్ పటేల్, సత్య పింగిళి, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, శ్రీ శ్రావ్య, శ్వేతా మహేందర్, శ్రీ లక్ష్మి, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, పృధ్వి, శ్రీకాంత్, భూషణ్, అవినాష్, శశి, జస్వంత్, మణి తేజ, నికిల్, మధు, మనోజ్, అక్షయ్, సందీప్, లడ్డు, స్రవంతి, జాహ్నవి, వెంకట్‌రెడ్డి, వంశీ, రవి పులుసు, మాధవ్, క్రాంతి, వేణు, శ్రీవిద్య, అక్షిత, శ్రీవిద్య, గణేష్ రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, రాజేష్ వర్మ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
లండన్‌లో చేనేత బతుకమ్మ సంబరాలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి వెయ్యి మందికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం అన్నారు. అదే స్పూర్తితో రాష్ట్ర ఆపదర్మ మంత్రి కేటీఆర్ కృషికి తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలను 'చేనేత బతుకమ్మ దసరా సంబరాలు' గా జరుపుకున్నామన్నారు. టాక్ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని ఈవెంట్స్ ఇంచార్జ్ అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. కల్చరల్ ఇంచార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ, దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఏర్పాటు చేసిన దసరా 'అలాయ్ బలాయ్' అందరిని ఆకట్టుకుందన్నారు. చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి(బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హాజరైన ప్రవాస సంఘాల ప్రతినిధులు ఐక్యతను చాటుతూ మనమంతా ఒకటే అంటూ చేయి చేయి కలిపి అభివాదం చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరాపండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల మధ్య చార్మినార్ ఆకృతితో పూలతో అలంకరించిన ప్రతిమ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడమే కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో భారత హై కమీషన్ ప్రతినిధి అమిత్ శర్మతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేతవస్త్రాలు ధరించాలని కోరామని, అలాగే చాలామంది చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా ఉందన్నారు. పండగకు అడబిడ్డలను చేనేత శాలువాలతో సత్కరించిన కేటీఆర్‌కు, యూకే అడబిడ్డల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎంపీ కవితకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కవితతో కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు, ఎన్నారై టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షులు సేరు సంజయ్, స్వాతి బుడగం, ముఖ్య సభ్యులు గోపాల్ మేకల, మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, మల్లా రెడ్డి, రంజిత్ చాతరాజు, సాయి బూరుగుపల్లి, సత్యం కంది, వంశీ వందనపు, వేణు గోపాల్ రెడ్డి, గణేష్ పాస్తం, రాకేష్ పటేల్, నవీన్ భువనగిరి, రవి రత్తినేని, రవి ప్రదీప్ పులుసు, సత్య చిలుముల, శ్రీధర్ రెడ్డి, రాజేష్ వర్మ, రవి కిరణ్, వెంకీ సుధీరెడ్డి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జస్వంత్, భరత్ బాశెట్టి, వేణు నక్కిరెడ్డి వంశీ పొన్నం, రాజేష్ వాకా, నగేష్ బచ్చనబోయిన, రవీందర్ రెడ్డి, సతీష్ రెడ్డి బండ మహిళా విభాగం సభ్యులు, సుప్రజ పులుసు, ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, శ్రావ్య వందనపు, మమత జక్కీ, శ్వేతా మహేందర్, ప్రియాంక తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. -
టాక్ బోనాల జాతర పోస్టర్ని ఆవిష్కరించిన కవిత
హైదరాబాద్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జూన్ 25న వెస్ట్ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్‌ను పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ముఖ్య సభ్యులు నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రోహిత్ రావు, విజయ్ కోరబోయిన, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.