
ప్రత్యేక ఆకర్షణగాలండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కుయుకే నలుమూలల నుండి సుమారు 2000కి పైగా ప్రవాసీయులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాఖ్యాతలుగా ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యవహరించారు.
ముఖ్య అతిదులుగా పార్లమెంటరీ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (మైగ్రేషన్ & సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్, అతిదులుగా కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం అందరికీ బోనాలు (Bonalu) శుభాకాంక్షలు తెలిపారు. టాక్ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సంస్థను నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థ ద్వారా ఆడబిడ్డలందరు బోనాలతో సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ భవిష్యత్తు కార్యక్రమాలను ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి వివరించారు.
ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తన సహకారం వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం సంతోషమన్నారు. ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ నవీన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు -బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.
బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానిక సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు టాక్ అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే మాజీ అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈవెంట్ స్పాన్సర్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది.
ఈ కార్యక్రమంలో, పవిత్ర, సత్య చిలుముల, మట్టా రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్, నాగ్, శ్రీధర్ రావు, శైలజ,స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్వేత శ్రీవిద్య, నీలిమ, పృద్వి, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరిగౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా, తదితరులు పాల్గొన్నారు.