Hyd: భారీ వర్షం.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు | Hyderabad Heavy Rains Traffic Police Advise Citizens | Sakshi
Sakshi News home page

Hyd: భారీ వర్షం.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

Jul 28 2026 7:07 PM | Updated on Jul 28 2026 7:27 PM

 Hyderabad Heavy Rains Traffic Police Advise Citizens

హైదరాబాద్‌: భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని జోన్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందని, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోందని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మీ భద్రతే మా ప్రాధాన్యం. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండండి. సురక్షితంగా ఉండండి’’ అని అన్నారు.

ప్రయాణం తప్పనిసరి అయితే..

  • నెమ్మదిగా, జాగ్రత్తగా వాహనం నడపండి.

  • ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించండి.

  • నీరు నిలిచిన రహదారుల గుండా వాహనాలు నడిపే ప్రయత్నం చేయవద్దు.

  • ప్రయాణానికి అదనపు సమయం కేటాయించి, ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోండి.

  • సోషల్ మీడియా వేదికల్లో అధికారిక ట్రాఫిక్ సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి.

హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కూడా ఎక్స్‌లో పలు సూచనలు చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement