'అలాంటి వారికి మార్గనిర్దేశం చేయాలి': ప్రధాని మోదీ పిలుపు | Prime Minister Modi Released another Video about Neet Paper Leak | Sakshi
Sakshi News home page

Narendra Modi: 'అలాంటి వారికి మార్గనిర్దేశం చేయాలి': ప్రధాని మోదీ

Jul 31 2026 11:41 PM | Updated on Jul 31 2026 11:46 PM

Prime Minister Modi Released another Video about Neet Paper Leak

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై మరోసారి మాట్లాడారు. జంతర్‌మంతర్‌లో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారని అన్నారు. నిరసనలో కొందరు ‍‍అసభ్యకరమైన పదాలు వాడారని అన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అయినప్పటికీ అందరినీ తాను క్షమించానని ప్రధాని మోదీ వెల్లడించారు. సరికొత్త భారత్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తప్పుదోవ పట్టిన వారికి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని సూచించారు. 

కాగా.. నీట్ పేపర్ లీక్‌ కావడంతో కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ నిరసనను కొన్ని రాజకీయ పార్టీలు అవకాశంగా మార్చుకున్నాయి. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో హంగామా చేశారు. చివరికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ మరో వీడియో సందేశమిచ్చారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement