శ్రీ బాలాజీ దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం | Gloucestershire Balaji Temple Weekly Make-Shift Temple Event Held with Grand Annadanam | Sakshi
Sakshi News home page

శ్రీ బాలాజీ దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం

Jul 30 2026 1:16 PM | Updated on Jul 30 2026 1:21 PM

gloucestershire Balaji Temple weekly Make Shift Temple

యూకేలోని గ్లౌసెస్టర్‌షైర్ ప్రాంతంలో తాత్కాలిక శ్రీ బాలాజీ ఆలయం ఏర్పాటు తోపాటు ఘనంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఆధ్యాత్మిక శక్తి, ఐక్యతలకు నిదర్శంనగా నిలిచింది ఈ వేడుక. విదేశీగడ్డపై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భక్తులంతా వాలంటీర్‌గా ముందుకు వచ్చి..  సనాతన ధర్మ స్ఫూర్తిని  చాటడం విశేషం. ఈ వేడుకలో పురోహిత విధులను  అరవింద్, లక్ష్మి, సహస్ర నిర్వహించగా, ఆలయ కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరిగేలా శ్రీనిరెడ్డి, మాధురి కుటుంబం, అలాగే శ్రీలక్ష్మీ, శ్రీని అర్గిల్ల, శిల్ప కుటుంబం పర్యవేక్షించింది. 

నరేష్, సురేష్‌ బండారులు విగ్రహాలను సమకూర్చగా, మహిళలు,  చిన్నారులు స్వామి అలకంరణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీలక్ష్మీ, రాజేష్‌, నానీ, సోను కుటుంబ సభ్యులు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలా వాలంటీర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవిశ్రాంతంగా సేవలందించారు. ఇది  గ్లౌసెస్టర్ హిందూ సమాజపు బలాన్ని, సనాతన ధర్మ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 

(చదవండి: న్యూయార్క్‌లో వైభవంగా ఆషాఢమాస బోనాలు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement