కామన్‌వెల్త్‌లో బంగారు పంట.. ఒక్కరోజే ఆరు స్వర్ణాలు కైవసం | Sachin Siwach clinches the Gold Medal Mens 60kg Boxing event at Glasgow | Sakshi
Sakshi News home page

Sachin Siwach: కామన్‌వెల్త్‌లో బాక్సింగ్ బంగారాలు.. సచిన్ సివాచ్‌కు స్వర్ణం

Aug 1 2026 11:20 PM | Updated on Aug 1 2026 11:22 PM

Sachin Siwach clinches the Gold Medal Mens 60kg Boxing event at Glasgow

కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ దూసుకెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ ఆరు బంగారు పతకాలు బాక్సింగ్‌లోనే రావడం మరో విశేషం. ఈ మెడల్స్‌తో పతకాల పట్టికలో భారత్ ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటికే ప్రీతి పవార్‌, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, ‍అరుంధతి చౌదరి పసిడి పతకాలు నెగ్గారు.

తాజాగా ఈ లిస్ట్‌లో సచిన్ సివాచ్ కూడా చేరారు. పురుషుల 60 కేజీల విభాగంలో పోటీపడిన సచిన్ సివాచ్‌ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్‌ బౌట్‌లో ఆస్ట్రేలియా బాక్సర్‌ను చిత్తు చేశాడు. ఈ పతకంతో ఇండియా మెడల్స్ సంఖ్య ఓవరాల్‌గా 36కు చేరుకుంది. దీంతో ప్రస్తుతం పతకాల పట్టికలో ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement