మేరీ కోమ్‌ స్ఫూర్తి.. కామన్‌వెల్త్‌లో పాకిస్తాన్‌కు తొలి పతకం | Pakistan-Boxer-Who-Inspired-by-Indian-Mary-Kom-Won Bronze-CWG-2026 | Sakshi
Sakshi News home page

CWG-2026: మేరీ కోమ్‌ స్ఫూర్తి.. కామన్‌వెల్త్‌లో పాకిస్తాన్‌కు తొలి పతకం

Aug 1 2026 7:06 PM | Updated on Aug 1 2026 7:58 PM

Pakistan-Boxer-Who-Inspired-by-Indian-Mary-Kom-Won Bronze-CWG-2026

Photo Credit: Twitter

భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేరీ కోమ్ ఇచ్చిన స్ఫూర్తి భార‌త్‌లో ఎంతోమంది మ‌హిళా బాక్స‌ర్ల‌ను పుట్టేలా చేసింది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన స్ఫూర్తి దేశ స‌రిహ‌ద్దుల‌ను కూడా దాటి పాకిస్తాన్‌ను కూడా తాకింది. విష‌యంలోకి వెళితే పాకిస్తాన్ బాక్స‌ర్ అయిన 22 ఏళ్ల ఫాతిమా జ‌హ్రా కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో మ‌హిళ‌ల 60 కేజీల విభాగంలో కాంస్య ప‌త‌కం గెలుచుకుంది.

త‌ద్వారా కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో ప‌త‌కం సాధించిన తొలి పాకిస్తాన్ బాక్స‌ర్‌గా ఫాతిమా నిలిచింది. అంతేకాదు ఈ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఫాతిమా సాధించిన పతకమే వారికి మొదటిది కావడం గమనార్హం. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న స‌ర్ఘోడాలో పెరిగిన ఫాతిమా భార‌త దిగ్గ‌జ బాక్స‌ర్ మేరీ కోమ్‌ను ఆద‌ర్శంగా తీసుకుంది. మేరీ కోమ్ జీవితం ఆధారంగా 2014లో బాలీవుడ్‌లో తెర‌కెక్కిన బ‌యోపిక్ అప్ప‌టికి 10 ఏళ్ల వ‌య‌సు ఉన్న ఫాతిమాపై చెర‌గ‌ని ముద్ర వేసింది. 

ఆ సినిమాలో మేరీ కోమ్ జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను దాటుకొని దిగ్గ‌జ బాక్స‌ర్‌గా పేరు పొంద‌డం ఫాతిమాను బాగా ఆక‌ట్టుకుంది. ఆ క్ష‌ణంలోనే తాను కూడా బాక్స‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌న్న‌ది. అయితే ఫాతిమా బాక్స‌ర్ అయ్యే క్ర‌మంలో సొంత దేశంలో ఎంతో వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంది. ఫాతిమా కుటుంబం బాక్సింగ్‌కు వ్య‌తిరేకంగా ఉండేది. 

ఆమెను శిక్ష‌ణ‌కు వెళ్ల‌నిచ్చేవారు కాదు. కానీ సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఫాతిమా చేసిన పోరాటం ఆమెపై వ్య‌తిరేక‌త‌ను పోగొట్టి మ‌ద్దతు పెరిగింది. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ వాళ్ల దేశానికి కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో ప‌త‌కం తీసుకొచ్చి అంద‌రి చేత శెభాష్ అనిపించుకుంది. 

కాగా ప‌త‌కం సాధించిన అనంత‌రం ఫాతిమా మాట్లాడుతూ.. భారతదేశానికి చెందిన మేరీ కోమ్ నాకు స్ఫూర్తి. ఆమె జీవితంపై తీసిన సినిమాను నేను అప్ప‌ట్లో ప్ర‌తీరోజు చూసేదాన్ని. నేను బాక్సింగ్ మొదలుపెట్టినప్పుడు ఆ సినిమా చూస్తూ శిక్షణ తీసుకునేదాన్ని. ఆమె అంటే నాకు చాలా గౌరవం. దేవుడి ద‌య‌వ‌ల్ల ఇవాళ ఆమె లాగే మా దేశానికి ఒక ప‌త‌కం తీసుకొచ్చాను. ఏదో ఒక‌రోజు ఆమెలానే మా దేశానికి నేను కూడా పేరు ప్ర‌ఖ్య‌తలు తీసుకొస్తాన‌ని ఆశిస్తున్నా* అని తెలిపింది.

ఇక మేరీకోమ్ ఘ‌న‌తల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అమెచ్యూర్ బాక్సింగ్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసింది. మేరీకోమ్ త‌న కెరీర్‌లో ఆరు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిళ్లు, ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు, ఐదు ఆసియా ఛాంపియన్‌షిప్‌లను గెలిచి అత్యున్న‌త శిఖ‌రాన్ని అందుకుంది.

 

చదవండి: సెంట్రల్‌ జోన్‌ కెప్టెన్‌గా పటీదార్‌.. అందరి కళ్లు అతడిపైనే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement