విజయనగరం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభకు జనాన్ని తరలించేందుకు అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం చూపిన అత్యుత్సాహం గ్రామీణ ప్రయాణికులకు కష్టాలు తెచ్చింది. ప్రభుత్వం అడిగిన ప్రతిపాదన కంటే మరో 400 బస్సులు అదనంగా కేటాయించి ఆర్టీసీ అధికారులు తమ స్వామిభక్తిని చాటుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు జోన్లలో కడప మినహా ఏకంగా మూడు జోన్ల నుంచి 2 వేల ఆర్టీసీ బస్సులను ఈ ఒక్క సభకే కేటాయించడం గమనార్హం. దీంతో ఆయా జోన్ల డిపోలను ఖాళీ చేసి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు తరలించారు. కొన్ని బస్సులు జనాలు లేకుండానే ఎయిర్‌పోర్టుకు ప్రయాణించాయి.


