breaking news
Non-resident Indian
-
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు -
మాతృభూమికి సేవచేస్తా
స్థానిక సమస్యలు పరిష్కరిస్తా.. మన దేశంలో రోడ్డు ప్రమాదాలు బాధాకరం ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం విద్యావిధానంలో మూస పద్ధతి వద్దు నైపుణ్యం ఉంటే ఉపాధి గ్యారంటీ ఎన్ఆర్ఐ సామల ప్రదీప్ ‘‘యువతరం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో నిలుస్తోంది.. యువశక్తిని సరైన మార్గంలో పెట్టడం ద్వారా దేశాభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చు..’’ అని చెబుతున్నారు ప్రవాస భారతీయుడు సామల ప్రదీప్. వరంగల్ నగరంలో పుట్టి పెరిగిన ఆయన ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తన సొంతూరు వరంగల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. వరంగల్ కేంద్రంగా కొనసాగించనున్న సేవా కార్యక్రమాల వివరాలను ఆయన ‘సాక్షి’కి వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.. – సాక్షి, హన్మకొండ రోడ్డు ప్రమాదాలపై సదస్సులు.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా ఆరు లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇందులో 85 శాతం మంది 15 నుంచి 45 ఏళ్లలోపు వయసు వారే ఉంటున్నారు. అందులో 80 శాతం పురుషులే ఉంటున్నారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రధాన కారణాలు. ముఖ్యంగా ప్రమాదాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే ఆర్గనైజైడ్ సంస్థల ఆధ్వర్యంలో ఉండే బస్సులు, ట్రక్కులు, లారీల వల్ల 10 శాతం ప్రమాదాలు జరుగుతున్నా యి. సరైన అవగాహన లేకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నివారించ తగిన ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. అందువల్లే వరంగల్‌తో పాటు పొరుగు జిల్లాల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. సదస్సులకు జాతీయ స్థాయి సంస్థలను కూడా తీసుకొస్తాం. డిమాండ్‌కు తగినట్లుగా.. నేను అమెరికాలో రిక్రూట్మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాను. అక్కడికి వచ్చే మనవాళ్లని, ఇక్కడి విద్యార్థులను పరిశీలిస్తే విద్యా విధానంలో మూస పద్ధతి ఎక్కువగా ఉంది. తమ ప్రతిభ, ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ఒకటి రెండు కోర్సుల వైపు ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారు. దీంతో డిమాండ్‌కు మించి విద్యార్థులు వృత్తి విద్యాకోర్సుల్లో ఉత్తీర్ణులవుతున్నారు. వీరందరికీ ఉద్యోగాలు రావడం కష్టమవుతోంది. వృత్తివిద్యా కోర్సుల్లో సాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులు అటు చదువుకు తగిన ఉద్యోగం పొందలేక.. ఇటు సాధారణ ఉద్యోగాలకు ముందుకు రావడం లేదు. ఫలితంగా విద్యార్థులు విలువైన సమయాన్ని సరైన ఉద్యోగం కోసం ఎదురు చూడడంతోనే కోల్పోతున్నారు. చివరకు వీరు సాధారణ ఉద్యోగాలకు ప్రయత్నించినా... ఓవర్ క్వాలీఫైడ్ కావడంతో కంపెనీలు ఉపాధి కల్పనకు ముందుకు రావడం లేదు. పాలిటెక్నిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి కోర్సులకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులు, విద్యార్థుల ఎంపిక, తదితర అంశాలపై విద్యార్థులకు స్పష్టత రావాలి. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. రాబోయే రెండుమూడు నెలల్లో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తాం. నైపుణ్యం పెంచుతా.. త్వరలో వరంగల్ నగరంలో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ పార్కును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గతంలో అజంజాహి మిల్లు నడిచిన కాలంలో ఇక్కడ చేనేత రంగంలో నిపుణులు ఎక్కువ మంది ఉండేవారు. ఆ మిల్లు మూతపడిన తర్వాత నైపుణ్యం ఉన్న వారు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. టెక్స్టైల్స్ పార్కు ప్రారంభమయ్యేనాటికి స్థానిక యువకులకు చేనేత రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు శాశ్వత ప్రతిపాదికన ఓ ఫ్లాట్‌ఫాం నెలకొల్పుతా. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాం. అలాగే వరంగల్ నగరంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. -
ఎన్ఆర్ఐ హత్యపై విభిన్న కథనాలు
సాక్షి, న్యూఢిల్లీ: అన్మోల్ సర్నా (20) అనే ప్రవాస భారతీయ యువకుడి మృతి కేసు రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. మూడు రోజుల కిందట తన స్నేహితుడి ఇంట్లోనే ఇతడు హత్యకు గురైనట్టు వార్తలు రావడం తెలిసిందే. ఈ విషయంలో పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. తీసుకున్న మాదకపదార్థాలు వికటించడంతో హింసాత్మకంగా ప్రవర్తించిన అన్మోల్ను సెక్యూరిటీ గార్డులు కొట్టారని, అతడు కూడా తనకు తానే గాయపర్చుకున్నాడని దక్షిణఢిల్లీ డీసీపీ పి.కరుణాకరణ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. స్నేహితులే కుట్ర చేసి అన్మోల్ను చంపారని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు హంతకులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అన్మోల్ మిత్రులు ప్రణేల్ షా, శివాంక్ గంభీర్, రిథమ్ గిర్హోత్రా, మాధవ్ భండారీని మాదక పదార్థాలను సేవించినందుకు ఈ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా 20 ఏళ్ల వయసు వారే. సెక్యూరిటీ గార్డులు సురేందర్బాలీ, నరేశ్ మిశ్రాను హత్యారోపణలపై ఆరెస్టు చేశారు. అయితే శివాంక్ గంభీర్, మాధవ్ భండారీలకు స్థానిక కోర్టు ఈ నెల 19 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. విదేశాలకు వెళ్తున్న శివాంక్ గంభీర్‌కు వీడ్కోలుగా అన్మోల్, అతని మిత్రులు పార్టీ జరుపుకోవాలని 11వ తేదీన నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నోయిడాకు చెందిన ఒక వ్యక్తి దగ్గరి నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారని కరుణాకరణ్ చెప్పారు. ఆయన కథనం ప్రకారం ఈ ఐదుగురు మిత్రులు సెప్టెంబర్ 13 రాత్రి తొమ్మిది గంటలకు కాల్కాజీలోని సౌత్‌పార్క్ అపార్ట్మెంట్స్లోని ప్రణేల్ నివాసంలో పార్టీ చేసుకున్నారు. బిల్డింగ్ టైపై మద్యం, మాదకద్రవ్యాలు సేవించారు. అవి వికటించడంతో అన్మోల్ హింసాత్మకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మిత్రులతో గొడవపడి సామాన్లన్నీ విసిరివేశాడు. ఓ టీవీని కూడా విరగ్గొట్టాడు. ఇతని గొడవ భరించలేక ప్రణేల్ తండ్రి వీరిని ఇంటి నుంచి బయటకు పంపేశాడు. ఆ తరువాత అన్మోల్ అపార్ట్మెంట్ కిందకు వచ్చి అరుస్తూ, పరుగెత్తుతూ విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అన్మోల్ గార్డులను చెంపదెబ్బ కొట్టడం, వాళ్లు తమదగ్గరున్న కర్రలతో అన్మోల్ను బాదడం అంతా సీసీటీవీ వీడియోల్లో రికార్డయింది. గార్డులు అన్మోల్ పిరుదులు, తలపై కొట్టినా, చంపాలన్న ఉద్దేశం వారికి లేదని కరుణాకరణ్ వివరణ ఇచ్చారు. ఆ తరువాత అన్మోల్ తలను గేటుకేసి గుద్దుకున్నాడని, చొక్కా లేకుండా రోడ్డుపై పరుగులు తీశాడని చెప్పారు. అన్మోల్ మిత్రులు ఈ విషయాన్ని అతని తల్లికి చెప్పడానికి కాల్ చేసినా ఆమె స్వీకరించలేదు. తర్వాత ఆమె మళ్లీ వారికి ఫోన్ చేసినప్పుడు మిత్రులు భయంతో ఫోన్ ఎత్తలేదన్నారు.


