మాతృభూమికి సేవచేస్తా
‘‘యువతరం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో నిలుస్తోంది.. యువశక్తిని సరైన మార్గంలో పెట్టడం ద్వారా దేశాభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చు..’’ అని చెబుతున్నారు ప్రవాస భారతీయుడు సామల ప్రదీప్. వరంగల్ నగరంలో పుట్టి పెరిగిన ఆయన ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
-
స్థానిక సమస్యలు పరిష్కరిస్తా..
-
మన దేశంలో రోడ్డు ప్రమాదాలు బాధాకరం
-
ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం
-
విద్యావిధానంలో మూస పద్ధతి వద్దు
-
నైపుణ్యం ఉంటే ఉపాధి గ్యారంటీ
-
ఎన్‌ఆర్‌ఐ సామల ప్రదీప్
‘‘యువతరం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో నిలుస్తోంది.. యువశక్తిని సరైన మార్గంలో పెట్టడం ద్వారా దేశాభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చు..’’ అని చెబుతున్నారు ప్రవాస భారతీయుడు సామల ప్రదీప్. వరంగల్ నగరంలో పుట్టి పెరిగిన ఆయన ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తన సొంతూరు వరంగల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. వరంగల్ కేంద్రంగా కొనసాగించనున్న సేవా కార్యక్రమాల వివరాలను ఆయన ‘సాక్షి’కి వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే..
– సాక్షి, హన్మకొండ
రోడ్డు ప్రమాదాలపై సదస్సులు..
దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా ఆరు లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇందులో 85 శాతం మంది 15 నుంచి 45 ఏళ్లలోపు వయసు వారే ఉంటున్నారు. అందులో 80 శాతం పురుషులే ఉంటున్నారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రధాన కారణాలు. ముఖ్యంగా ప్రమాదాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే ఆర్గనైజైడ్ సంస్థల ఆధ్వర్యంలో ఉండే బస్సులు, ట్రక్కులు, లారీల వల్ల 10 శాతం ప్రమాదాలు జరుగుతున్నా యి. సరైన అవగాహన లేకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నివారించ తగిన ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. అందువల్లే వరంగల్‌తో పాటు పొరుగు జిల్లాల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. సదస్సులకు జాతీయ స్థాయి సంస్థలను కూడా తీసుకొస్తాం.
డిమాండ్‌కు తగినట్లుగా..
నేను అమెరికాలో రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాను. అక్కడికి వచ్చే మనవాళ్లని, ఇక్కడి విద్యార్థులను పరిశీలిస్తే విద్యా విధానంలో మూస పద్ధతి ఎక్కువగా ఉంది. తమ ప్రతిభ, ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ఒకటి రెండు కోర్సుల వైపు ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారు. దీంతో డిమాండ్‌కు మించి విద్యార్థులు వృత్తి విద్యాకోర్సుల్లో ఉత్తీర్ణులవుతున్నారు. వీరందరికీ ఉద్యోగాలు రావడం కష్టమవుతోంది. వృత్తివిద్యా కోర్సుల్లో సాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులు అటు చదువుకు తగిన ఉద్యోగం పొందలేక.. ఇటు సాధారణ ఉద్యోగాలకు ముందుకు రావడం లేదు. ఫలితంగా విద్యార్థులు విలువైన సమయాన్ని సరైన ఉద్యోగం కోసం ఎదురు చూడడంతోనే కోల్పోతున్నారు. చివరకు వీరు సాధారణ ఉద్యోగాలకు ప్రయత్నించినా... ఓవర్ క్వాలీఫైడ్ కావడంతో కంపెనీలు ఉపాధి కల్పనకు ముందుకు రావడం లేదు. పాలిటెక్నిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి కోర్సులకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులు, విద్యార్థుల ఎంపిక, తదితర అంశాలపై విద్యార్థులకు స్పష్టత రావాలి. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. రాబోయే రెండుమూడు నెలల్లో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తాం.
నైపుణ్యం పెంచుతా..
త్వరలో వరంగల్ నగరంలో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్కును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గతంలో అజంజాహి మిల్లు నడిచిన కాలంలో ఇక్కడ చేనేత రంగంలో నిపుణులు ఎక్కువ మంది ఉండేవారు. ఆ మిల్లు మూతపడిన తర్వాత నైపుణ్యం ఉన్న వారు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. టెక్స్‌టైల్స్ పార్కు ప్రారంభమయ్యేనాటికి స్థానిక యువకులకు చేనేత రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు శాశ్వత ప్రతిపాదికన ఓ ఫ్లాట్‌ఫాం నెలకొల్పుతా. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాం. అలాగే వరంగల్ నగరంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.