అమెరికాలోని భారతీయుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్న వేళ గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) కోసం దరఖాస్తు చేసుకునే హెచ్-1బి (H-1B) వీసాదారులకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) భారీ ఊరట నిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన (ప్రాసెసింగ్) జరిగే సమయంలో అత్యధిక శాతం మంది వలసదారులు అమెరికాలోనే కొనసాగవచ్చని, వారు దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని DHS స్పష్టం చేసింది.
గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు, వారి దరఖాస్తులు ప్రాసెస్ అవుతున్నప్పుడు అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేద నిడీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఇటీవలి ప్రకటనపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో విధానంలో ఎలాంటి పెద్ద మార్పు జరగలేదని స్పష్టత వచ్చింది. దీని ప్రకారం గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యే వరకు అమెరికాలోనే సురక్షితంగా ఉండవచ్చు.
ఇదీ చదవండి: ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యం
దరఖాస్తుదారుడు అమెరికా వెలుపల ఉండి ప్రక్రియను పూర్తి చేయాలా లేదా అనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ విచక్షణాధికారాల (case-by-case basis) ప్రకారం చాలా కాలంగా నిర్ణయిస్తున్నారు. తాజా మార్గదర్శకాలు కేవలం ఆ పాత అధికారాలను గుర్తుచేసేవే తప్ప కొత్త నిబంధనలు కావనిడీహెచ్‌ఎస్ ప్రతినిధి తెలిపారు.
కాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) చేసిన ఒక ప్రకటన వల్ల దరఖాస్తు దారులలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసాధారణ మినహాయింపులంటే తప్ప, వారు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉండాలంటూ వెలువడిన వార్త తీవ్ర ఆందోళన రేపింది.


