ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యం | Not a one time CM Astrologer predicts long political innings for DK Shivakumar | Sakshi
Sakshi News home page

ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యం

May 30 2026 11:57 AM | Updated on May 30 2026 2:18 PM

Not a one time CM Astrologer predicts long political innings for DK Shivakumar

సాక్షి, చెన్నై: కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సన్నాహాలు జరుగుతున్న వేళ, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు  డీకే శివకుమార్  శాసనసభాపక్ష (CLP) నాయకుడిగా ఎన్నికవడం, సీఎం పదవిని దక్కించుకోవడం ఇక లాంఛనప్రాయమేననిఅందరూ భావిస్తున్నారు ఈ క్రమంలో డీకే రాజకీయ ప్రస్థానం సుదీర్ఘకాలం కొనసాగుతుందని జ్యోతిష్యుడు ద్వారకానాథ్ గురూజీ జోస్యం, ఆసక్తికరంగా మారింది.

ప్రమాణ స్వీకారానికి సూచించిన తేదీలు
మనీ కంట్రోల్‌ కథనం ప్రకారం డీకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ద్వారకానాథ్ గురూజీ మూడు అనుకూలమైన తేదీలుగా మే 31 (ఆదివారం), లేదంటే జూన్ 5, 6 శుక్ర, శని) సూచించారట.

గురూజీ అంచనాలు 
డీకే శివకుమార్ కేవలం తాత్కాలిక లేదా ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కాదని, ఆయన జాతకం చాలా బాగుందని గురూజీ తెలిపారు. ఆయన కర్ణాటక రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషిస్తారని ప్రశంసించారు. శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం (హైకమాండ్) పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సీఎంగా డీకే.. జూన్‌ 3 ముహూర్తం : ఎందుకలా?

2028 ఎన్నికల్లోనూ విజయం
శివకుమార్ నాయకత్వంలోని దూరదృష్టి వల్ల కర్ణాటక రాష్ట్రం   సుసంపన్నంగా ఉంటుందని  గురూజీ  జోస్యంచెప్పారు. అయితే, వచ్చే (2028) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన అసలైన ముఖ్యమంత్రి అవుతారని, ప్రస్తుతానికి ఆయనపై కేవలం బాధ్యతలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, తదుపరి విడతలో ముఖ్యమంత్రి పదవిని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని సూచించారు.

కాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించి, మంత్రివర్గాన్ని రద్దు చేసిన తర్వాత కర్ణాటకలో రాజకీయ వ్యూహాలు వేగవంతమయ్యాయి.శనివారం సాయంత్రం బెంగళూరులోని విధానసౌధలో జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకో నున్నారు. ఈ రేసులో డీకే శివకుమార్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు, ఆయన ఎన్నిక దాదాపు ఖాయమని అందరూ భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement