ఆస్ట్రేలియా వీసా ఫీజు 25 శాతం పెంపు | australia-visa-fees-hike-indian-students-workers | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా వీసా ఫీజు 25 శాతం పెంపు

Jul 10 2026 9:02 PM | Updated on Jul 10 2026 9:02 PM

australia-visa-fees-hike-indian-students-workers

ఉన్నత చదువులు చదవాలన్నా, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలన్నా నేడు భారతీయుల మొదటి ఛాయిస్‌ల్లో ఆస్ట్రేలియా ఒకటి. అయితే, తాజాగా ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లాలనుకునే లక్షలాది మంది భారతీయుల ఆశలపై ఆర్థిక భారాన్ని మోపింది. ముందస్తు సంప్రదింపులు లేకుండానే అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికుల వీసా దరఖాస్తు రుసుములను 25 శాతం వరకు పెంచుతూ ఆస్ట్రేలియా హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గత రెండేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఈ వీసా ఫీజు తాజా పెంపుతో అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాను అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా మార్చేసింది. నేషనల్ సెక్యూరిటీ బడ్జెట్ ఖర్చులను భర్తీ చేయడానికే ఈ పెంపు అని అక్కడి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది అంతర్జాతీయ విద్యార్థులను ఒక ఆదాయ వనరులాగా వాడుకోవడమేనని నిపుణులు మండిపడుతున్నారు.

కొత్తగా మారిన వీసా ధరల స్వరూపం (ఆస్ట్రేలియన్ డాలర్లలో)

వీసా రకంపాత ఫీజుసవరించిన కొత్త ఫీజుపెంపు శాతం
స్టూడెంట్ వీసా (సబ్‌క్లాస్‌ 500) (యూనివర్సిటీ, వొకేషనల్)2,0002,500 (సుమారు రూ.1.38 లక్షలు)25%
తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసా (సబ్‌క్లాస్‌ 485) (వర్క్ పర్మిట్)4,6005,750 (సుమారు రూ.3.17 లక్షలు)25%
ఇండిపెండెంట్ ELICOS (ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సులు)2,0002,0502.5%

గమనిక: స్టూడెంట్ వీసా ఫీజులు 2024 జులైకి ముందు కేవలం 710 డాలర్లు మాత్రమే ఉండేవి. రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇది 710 నుంచి 1600, ఆపై 2000 డాలర్లు... ఇప్పుడు ఏకంగా 2,500 డాలర్లకు చేరింది. అంటే దాదాపు 252 శాతం పెంపు నమోదైంది!

భారతీయులపై పడే ప్రభావం ఏమిటి?

1. రీఫండ్ లేని భారీ రుసుము: ఆస్ట్రేలియా వీసా విధానంలో అత్యంత కఠినమైన నిబంధన ఏంటంటే.. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైనా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. లక్షల రూపాయలు పోసి దరఖాస్తు చేసుకున్న తర్వాత వీసా రాకపోతే ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు పెద్ద రిస్క్.

2. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పెంపు నుంచి ఏషియన్‌(ఆగ్నేయాసియా దేశాల కూటమి) దేశాలకు, పసిఫిక్ దీవుల విద్యార్థులకు మినహాయింపు ఇచ్చి పాత ఫీజులనే వర్తింపజేసింది. కానీ, ఆస్ట్రేలియాకు రెండో అతిపెద్ద విద్యార్థుల వనరుగా ఉన్న భారతదేశానికి ఎలాంటి మినహాయింపు లభించకపోవడం గమనార్హం.

3. ఉపాధి వీసాలూ ఖరీదే: చదువు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియాలోనే ఉండి పని చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే ‘తాత్కాలిక గ్రాడ్యుయేట్ వర్క్ వీసా’ ఫీజు ఏకంగా 5,750 డాలర్లకు పెరగడం వల్ల అక్కడ స్థిరపడాలనుకునే యువతపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడనుంది.

అంతర్జాతీయ విద్యారంగం స్పందన

ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై ‘యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా’, భారతీయ విద్యా ప్రతినిధుల సంఘం (ఏఏఈఆర్‌ఐ) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించాలనుకుంటూ ప్రవేశ రుసుములను ఇంతలా పెంచడం ఆస్ట్రేలియా అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని హెచ్చరించాయి. వీసా ఫీజును ఒకేసారి కాకుండా అప్రూవల్ అయ్యాక రెండో విడతగా తీసుకునే ‘టూ-స్టేజ్ పేమెంట్’ విధానాన్ని తేవాలని భారతీయ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement