ఆస్ట్రేలియా తరహా చట్టాలు భారత్‌లోనూ? | Social Media Ban for Children, PM Modi Backs Australia Approach | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా తరహా చట్టాలు భారత్‌లోనూ?

Jul 10 2026 12:17 PM | Updated on Jul 10 2026 12:32 PM

Social Media Ban for Children, PM Modi Backs Australia Approach

పిల్లలను రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా ఆంక్షలు విధించే ఆస్ట్రేలియా చట్టాలు డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ విధానాల నుంచి భారత్‌తో పాటు.. ప్రపంచ దేశాలు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని మోదీ పేర్కొన్నారు.

మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నేతల సదస్సులో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో కలిసి పాల్గొన్న మోదీ, సమాచార సాంకేతికత (IT), సోషల్ మీడియా నియంత్రణ, ఆన్‌లైన్ భద్రత విషయంలో ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ముఖ్యంగా చిన్నారులను, సోషల్ మీడియా వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.

పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
ఆస్ట్రేలియా కొత్త నిబంధనల ప్రకారం.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు సృష్టించకుండా ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ వేధింపులు, మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం వంటి సమస్యలను తగ్గించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.

భారత్‌లో నిషేధంపై మోదీ హింట్ ఇచ్చారా?
భారత్‌లో కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలనే చర్చలు పెరుగుతున్న వేళ మోదీ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బహుశా ఈ నియమాలు మనదేశంలో కూడా అమలవుతాయా?, మోదీ హింట్ ఇచ్చారా?, అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే దిశగా అడుగులు వేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే మన దేశంలో కూడా సోషల్ మీడియా వినియోగాన్ని కఠినతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఓపెన్‌ఏఐలో కీలక పరిణామం.. ఏజీఐ సీఈఓ రాజీనామా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement