డేవిడ్‌ వార్నర్‌ యూటర్న్‌?!.. పోస్ట్‌ వైరల్‌ | Is David Warner To Take A U Turn On International Retirement Drops Hint | Sakshi
Sakshi News home page

డేవిడ్‌ వార్నర్‌ సంచలన నిర్ణయం!.. యూటర్న్‌?

Jul 10 2026 1:31 PM | Updated on Jul 10 2026 1:35 PM

Is David Warner To Take A U Turn On International Retirement Drops Hint

ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉంటాడు. తన కెరీర్‌, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్‌డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు. అయితే, తాజాగా వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీ వైరల్‌గా మారింది.

నేను సిద్ధంగా ఉన్నాను
బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగమైన సిడ్నీ థండర్‌ జెర్సీలో ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘ప్రపంచంలో ఎక్కడైనా.. నా దేశం కోసమైనా సరే ఆడటానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని వార్నర్‌ స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్‌ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది.

అన్ని ఫార్మాట్లకూ గుడ్‌బై
కాగా పదిహేనేళ్ల సుదీర్ఘ కెరీర్‌ అనంతరం 2024లో వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే ప్రపంచకప్‌-2023 తర్వాత (నవంబరులో) వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 2024 జనవరిలో టెస్టు ఫార్మాట్‌కూ గుడ్‌బై చెప్పాడు.

వన్డేల్లో చివరగా టీమిండియా.. టెస్టుల్లో పాకిస్తాన్‌తో వార్నర్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఇక అదే ఏడాది జూన్‌లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కూ వీడ్కోలు పలికాడు.

ఇక తన కెరీర్‌లో 2009- 2024 మధ్య ఆస్ట్రేలియా తరఫున మొత్తంగా 161 వన్డేలు, 112 టెస్టులు, 110 టీ20 మ్యాచ్‌లు ఆడాడు వార్నర్‌. వన్డేల్లో 6932, టెస్టుల్లో 8786, టీ20లలో 3277 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 22 వన్డే, 26 టెస్టు, ఒక టీ20 శతకం ఉన్నాయి.

టీ20 లీగ్‌లలో యాక్టివ్‌గా..
ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో అలరిస్తున్న వార్నర్‌.. చివరగా బిగ్‌ బాష్‌ లీగ్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లలో భాగమయ్యాడు. గతంలో ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్‌ 6565 పరుగులు సాధించాడు. 

ప్రస్తుతం లీగ్‌ క్రికెట్‌తో యాక్టివ్‌గానే ఉన్న వార్నర్‌.. నిజంగానే యూటర్న్‌ తీసుకుని ఆస్ట్రేలియా క్రికెట్‌లో వస్తాడా? అంటే.. ప్రస్తుత పోటీ దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు. కానీ 39 ఏళ్ల వార్నర్‌ మాత్రం అందుకు సుముఖంగానే ఉన్నానని తన పోస్టు ద్వారా చెప్పకనే చెప్పాడు. 

చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement