‘సర్‌’ ఎఫెక్ట్‌: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు! | Case Filed With Nhrc Over The Missing Votes Of Gulf Workers | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ఎఫెక్ట్‌: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు!

Jul 3 2026 8:23 PM | Updated on Jul 3 2026 9:26 PM

Case Filed With Nhrc Over The Missing Votes Of Gulf Workers

గల్ఫ్ కార్మికుల ఓట్ల గల్లంతుపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేసు నమోదు చేసింది. కరీంనగర్ టు గల్ఫ్.. ఓటు హక్కుపై నీలినీడలు కమ్ముకోవడంపై న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. 15 లక్షల మంది ప్రవాసాంధ్రుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న విషయాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు.  

పోర్టల్ లోపాల వల్ల వీసా పత్రాలు తిరస్కరణకు గురవుతున్నాయని న్యాయవాది రామారావు పేర్కొన్నారు. ఫామ్ 6A ఆన్‌లైన్ ఇబ్బందులతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో గల్ఫ్ వలస కార్మికులు ఉన్నారని.. ఆయన పేర్కొన్నారు. ఓట్లతో పాటు ఆస్తుల హక్కులపైనా ప్రవాసులలో ఆందోళన నెలకొంది. అసంపూర్ణ అఫీషియల్ మ్యాపింగే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రధానంగా  ఓట్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి మరింత  సమయం ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదులో విన్నవించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకృతం చేస్తే నిరక్ష్యరాస్యులు సైతం తమ ఓటు హక్కును కాపాడుకోగలుతారని, కాని పక్షంలో  ఓట్ల గల్లంతు జరుగుతుందనే విషయాన్ని న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

బయట దేశాల్లో ఉన్న  ఇక్కడ ఓటర్లకు ఇంట్లో వాళ్ల ద్వారా గుర్తింపు కార్డు ఇచ్చినా మాన్యువల్‌గా ఓటు నమోదు ప్రక్రియ కొనసాగేలే చూడాలన్నారు. ఓట్ల జాబితా సవరణలో భాగంగా సాంకేతిక ఆంశాల కారణంగా ఇలా ఓటు తిరస్కరణకు గురి కావడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.  ఈ అంశానికి సంబంధించిన ఫిర్యాదును రిజస్టర్‌ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement