22A నిషేధిత భూములపై ఆందోళన వద్దు.. పొంగులేటి భరోసా | Minister Ponguleti Srinivas Reddy Key Comments on 22A Lands | Sakshi
Sakshi News home page

22A నిషేధిత భూములపై ఆందోళన వద్దు.. పొంగులేటి భరోసా

Aug 17 2026 5:07 PM | Updated on Aug 17 2026 5:47 PM

Minister Ponguleti Srinivas Reddy Key Comments on 22A Lands

సాక్షి,హైదరాబాద్‌: 22ఏ నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు భూములు చేర్చడం అధికారుల తప్పిదమేనని, వాటిని సరిచేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో పొంగులేటి మీడియా మాట్లాడారు.  

‘ప్రజల ఆస్తులకు ఆటంకం కలిగించడం మా ప్రభుత్వ విధానం కాదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 22ఏపై ఇప్పటి వరకు 750 మంది ప్రైవేట్ భూములపై ఫిర్యాదులు అందాయి. మేడ్చల్‌ 500, రంగారెడ్డి 100 , హైదరాబాద్‌లో సైతం ఫిర్యాదులు వచ్చాయి. నాలుగు జిల్లాలు ప్రైమ్ ఏరియాలలో వచ్చిన కేసులపై విచారణ చేశాం. ఒక్క గజం ఆస్థి సైతం ఆటంకం కలిగించొద్దనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఉమ్మడి రంగారెడ్డిలో 350 ఫిర్యాదులు ఈఎన్‌సీకి చెందినవి. నిషేదిత జాబితా భూముల కేసు హై కోర్టులో కేసులు ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో అధికారుల తప్పిదాలను గుర్తించాం.కోర్టు ఆదేశాలను ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేయకపోవడం వల్లే సమస్య ఏర్పడింది. అధికారుల తప్పిదాలను సవరణ చేస్తున్నాం.నిజమైన కేసులు త్వరలోనే పరిష్కారం అవుతాయి.

ప్రజలు ఆందోళన చెందవద్దు.ప్రజలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం భాద్యత తీసుకుంటుంది. 22ఏపై ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. 22ఏతో ఇబ్బంది పడ్డ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. 22ఏ పేరు చెప్పి ప్రజలను ఆఫీస్‌ల చుట్టూ తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటాం. 22ఏ కేసుల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం. 22ఏ జెన్యూన్ కేసుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు. 18005-994788 టోల్ ఫ్రీకి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి’చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement