అమెరికా 'స్పెల్లింగ్ బీ' విజేతగా భారత సంతతి విద్యార్థి | Shrey Parikh: 14 year old Indian origin US Spelling Bee winner | Sakshi
Sakshi News home page

అమెరికా 'స్పెల్లింగ్ బీ' విజేతగా భారత సంతతి విద్యార్థి

May 29 2026 12:42 PM | Updated on May 29 2026 12:45 PM

Shrey Parikh: 14 year old Indian origin US Spelling Bee winner

అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి శ్రేయో పారిఖ్‌ విజేతగా నిలిచాడు.  కాలిఫోర్నియాలోని రాంచో కుకామోంగాకు చెందిన ఈ 14 ఏళ్ల బాలుడు, గురువారం రాత్రి జరిగిన ఫైనల్‌లో తన అపార ప్రతిభ ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. శ్రేయ్‌ మొత్తం 90-సెకన్ల స్పెల్-ఆఫ్ రౌండ్‌లో అంచనాలకు తగ్గట్టుగా మొత్తం 32 పదాలను సరిగ్గా పలికి విజయం దక్కించుకున్నాడు. 

ఈ గెలుపుతో సుమారు రూ. 48 లక్షల నగదు, పతకం, స్క్రిప్స్‌ కప్‌, మెరియం వెబ్‌స్టర్‌ నుంచి రూ. 24 లక్షల నగదుర, డెల్టా నుంచి రూ. 96 వేలు విలువ చేసే ఫ్లైట్‌ క్రెడిట్లు, ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికా నుంచి రూ. 38 వేలు విలువ చేసే వర్క్స్‌ శ్రేయ్‌కు లభించనున్నాయి. 

గతంలో 2024 పోటీల్లో మూడోస్థానంలో నిలవడగా..తాజా పోటీల్లో విజేతగా నిలిచి ట్రోపీ దక్కించుకున్నాడు. ఇక శ్రేయ్‌కు టెన్నిస్‌, రీడింగ్‌, గణితం, చెస్‌ వంటివి అతడి అభిరుచులు. చివరగా తనకు ఎక్కువగా భారత్‌లోని తాతయ్య నానమ్మల వద్ద గడపడం అంటే మహా ఇష్టం అని చెబుతున్నాడు. 

(చదవండి: నాడు నీట్‌ ఫెయిల్యూర్‌..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)
 

Advertisement
 
Advertisement
Advertisement