సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్ బాల్టిమోర్‌లో నిర్వహించనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా బృందం మహాసభ కార్యక్రమ వివరాలను సీఎంకు వివరించారు. ఎన్నారైలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దత్తత అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు.
సీఎంను కలిసిన వారిలో ఆటా నేషనల్ కో–ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కో–ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డితోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా మహాసభలకు హాజరవుతానని ఆటా ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
చదవండి: ఇకపై ప్రభుత్వ ఆస్తిగా హైదరాబాద్ మెట్రో
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (#ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అటా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేరీలాండ్ బాల్టిమోర్ లో నిర్వహించనున్న… pic.twitter.com/g7WTYtpWl1
— Telangana CMO (@TelanganaCMO) May 25, 2026


