అమెరికా వరదల్లో గల్లంతైన దేవరపల్లి యువకుడు | Devarapalli man missing in US floods | Sakshi
Sakshi News home page

అమెరికా వరదల్లో గల్లంతైన దేవరపల్లి యువకుడు

Jun 29 2026 4:19 AM | Updated on Jun 29 2026 4:19 AM

Devarapalli man missing in US floods

పర్చూరు (చినగంజాం): విద్య, ఉద్యోగ రీత్యా బాపట్ల జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువ­కుడు శనివారం ఉదయం అమెరికాలో సంభవించిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు దొప్పలపూడి వెంకటేష్‌ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. 

చదువు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం పొంది ఓక్లహామా సిటీలో ఉంటున్నాడు. అమెరికాలోని కాన్సాస్‌ వెల్లింగ్టన్‌కు వెళ్లిన వెంకటేష్‌ అక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుని ప్రవాహానికి కొట్టుకొనిపోయాడు. అతడు గల్లంతయిన విషయం శనివారం రాత్రి తల్లిదండ్రులకు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement