చంద్రబాబూ.. గుర్తుంచుకో.. ఇవన్నీ సంకేతాలే: సీదిరి | Seediri Appalaraju Comments On Chandrababu Government | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. గుర్తుంచుకో.. ఇవన్నీ సంకేతాలే: సీదిరి

Aug 14 2026 8:07 PM | Updated on Aug 14 2026 8:28 PM

Seediri Appalaraju Comments On Chandrababu Government

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైతే అణిచివేత ఉంటుందో.. అక్కడ ప్రజల తిరుగుబాటు కూడా అదే స్థాయిలో ఉంటుందని చంద్రబాబు తెలుసుకోవాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ నెల రోజూలు నాతో పాటు నా కుటుంబానికి కష్టకాలం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన వైఎస్‌ జగన్‌కు నమస్కారాలు’’

..ప్రభుత్వంలోని వారు కూడబలుక్కుని ఒక సాధారణ ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా చూపించి జైలుకి పంపారు.దీనిపై అన్ని వర్గాల ప్రజలు చిన్న పిల్లలపై రాజకీయాల అంటూ గొంతెత్తి మాట్లాడారు. ప్రభుత్వం అభద్రతా భావంతో చేసిన రాజకీయ కక్ష ఇది. రాజకీయాలలో తొక్కేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆతృతతో చేశారు.’’ అని సీదిరి మండిపడ్డారు.

‘‘ఈ జిల్లాలోనే ఎమ్మెల్యేలు, వారి పిల్లలే పిల్లలే ఆక్సిడెంట్ చేశారు. దానిపై ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడింది? మా మీద కక్ష తీర్చుకోవటం కోసం నా కొడుకుని బలితీసుకోవటం పట్ల అంతటా చర్చ జరుగుతుంది. నేను ఏం తప్పు చేశాను.. నన్ను జైలులో పెట్టేశారని మొదట్లో నాకు చిన్న నిరాశభావం ఉండేది. ఎప్పుడైతే మా నాయకుడు రాడానికి నిర్ణయం తీసుకున్నారో.. ఇది రాష్ట్ర వ్యాప్త చర్చ అవుతుందని తెలిశాక జైలులో ఉండటాన్ని సానుకూలంగా తీసుకున్నాను. ఈ నెల రోజులు కాలం నాకు, నా కుటుంబానికి దీక్ష సమయం లాంటిది.

..మా నాయకుడు వచ్చేటప్పుడు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే కిరణ్, తిలక్, జిల్లా పార్టీ అధ్యక్షులుపైన, ధర్మాన కుమారుడు పైన, చింతాడ రవి పైన కేసులు పెట్టారు. ఇవన్నీ చూస్తే ప్రజల్లో వచ్చిన నిరసన జ్వాలను ప్రభుత్వం తట్టుకోలేకోతుందేమోననుకుంటున్నాను. స్టేషన్ ఆఫీసర్లతో రాష్ట్ర ముఖ్యమ్మంత్రి రివ్యూ చేయటం దేశ చరిత్రలో ఇది మొదటిది. మరింత అణిచివేత ధోరణిలోకి వెళ్తామని మెసేజ్ ఇవ్వటమే ఇది. వైఎస్సార్‌సీపీకి, సాధారణ జనానికి మంచి రోజులు వచ్చినట్టే.. రానున్న కొద్ది రోజుల్లో వైఎస్‌ జగన్‌ సీఎం పీఠం అధిరోహిస్తాడనడానికి ఇవన్నీ సంకేతాలు. రాజకీయాలలో నేనొక ధన్యుడిని’’ అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement