breaking news
Seediri Appalaraju
-
రవిని నన్ను జైల్లో ఎంత ఇబ్బంది పెట్టారంటే
-
సీదిరి అప్పలరాజు అనుచరుడు వెంకటరమణ అక్రమ అరెస్ట్
-
రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం
-
వైఎస్ జగన్‌ను కలిసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ కేసులో అరెస్టై 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పారు.రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సీదిరి అప్పలరాజుకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పి, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. -
సీదిరి అప్పలరాజును పరామర్శించిన పుష్ప శ్రీ వాణి
-
సీదిరికి ఘన స్వాగతం పలికిన YSRCP నేతలు
-
నా కోసం జగనన్న జైలు వరకు వచ్చాడు.. నా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్తున్నా..
-
చంద్రబాబూ.. గుర్తుంచుకో.. ఇవన్నీ సంకేతాలే: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైతే అణిచివేత ఉంటుందో.. అక్కడ ప్రజల తిరుగుబాటు కూడా అదే స్థాయిలో ఉంటుందని చంద్రబాబు తెలుసుకోవాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ నెల రోజూలు నాతో పాటు నా కుటుంబానికి కష్టకాలం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్‌కు నమస్కారాలు’’..ప్రభుత్వంలోని వారు కూడబలుక్కుని ఒక సాధారణ ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా చూపించి జైలుకి పంపారు.దీనిపై అన్ని వర్గాల ప్రజలు చిన్న పిల్లలపై రాజకీయాల అంటూ గొంతెత్తి మాట్లాడారు. ప్రభుత్వం అభద్రతా భావంతో చేసిన రాజకీయ కక్ష ఇది. రాజకీయాలలో తొక్కేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆతృతతో చేశారు.’’ అని సీదిరి మండిపడ్డారు.‘‘ఈ జిల్లాలోనే ఎమ్మెల్యేలు, వారి పిల్లలే పిల్లలే ఆక్సిడెంట్ చేశారు. దానిపై ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడింది? మా మీద కక్ష తీర్చుకోవటం కోసం నా కొడుకుని బలితీసుకోవటం పట్ల అంతటా చర్చ జరుగుతుంది. నేను ఏం తప్పు చేశాను.. నన్ను జైలులో పెట్టేశారని మొదట్లో నాకు చిన్న నిరాశభావం ఉండేది. ఎప్పుడైతే మా నాయకుడు రాడానికి నిర్ణయం తీసుకున్నారో.. ఇది రాష్ట్ర వ్యాప్త చర్చ అవుతుందని తెలిశాక జైలులో ఉండటాన్ని సానుకూలంగా తీసుకున్నాను. ఈ నెల రోజులు కాలం నాకు, నా కుటుంబానికి దీక్ష సమయం లాంటిది...మా నాయకుడు వచ్చేటప్పుడు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే కిరణ్, తిలక్, జిల్లా పార్టీ అధ్యక్షులుపైన, ధర్మాన కుమారుడు పైన, చింతాడ రవి పైన కేసులు పెట్టారు. ఇవన్నీ చూస్తే ప్రజల్లో వచ్చిన నిరసన జ్వాలను ప్రభుత్వం తట్టుకోలేకోతుందేమోననుకుంటున్నాను. స్టేషన్ ఆఫీసర్లతో రాష్ట్ర ముఖ్యమ్మంత్రి రివ్యూ చేయటం దేశ చరిత్రలో ఇది మొదటిది. మరింత అణిచివేత ధోరణిలోకి వెళ్తామని మెసేజ్ ఇవ్వటమే ఇది. వైఎస్సార్సీపీకి, సాధారణ జనానికి మంచి రోజులు వచ్చినట్టే.. రానున్న కొద్ది రోజుల్లో వైఎస్ జగన్ సీఎం పీఠం అధిరోహిస్తాడనడానికి ఇవన్నీ సంకేతాలు. రాజకీయాలలో నేనొక ధన్యుడిని’’ అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. -
జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదల
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. ఆయనకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన అనంతరం అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల రోజూలు నాతో పాటు నా కుటుంబానికి కష్టకాలం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్‌కు నమస్కారాలు...ప్రభుత్వంలోని వారు కూడబలుక్కుని ఒక సాధారణ ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా చూపించి జైలుకి పంపారు.దీనిపై అన్ని వర్గాల ప్రజలు చిన్న పిల్లలపై రాజకీయాల అంటూ గొంతెత్తి మాట్లాడారు. ప్రభుత్వం అభద్రతా భావంతో చేసిన రాజకీయ కక్ష ఇది. రాజకీయాలలో తొక్కేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆతృతతో చేశారు.’’ అని సీదిరి మండిపడ్డారు.కాగా, వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది. సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది.పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు. -
సీదిరి అప్పలరాజు కు బెయిల్
-
కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్
-
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజురైంది. సీదిరి అప్పలరాజుకు సోంపేట కోర్టు.. ఇవాళ(శుక్రవారం) బెయిల్ మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే.సీదిరి అప్పలరాజుపై పెట్టిన కేసు రాజకీయ కక్షతోనేనని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. యాక్సిడెంట్ కేసును.. హత్య కేసుగా మార్చడం, అందులో సీదిరిని ఏ3గా చేర్చి.. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది.వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది.సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు.కాగా, సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. యు/ఎస్ 105 ఆర్/డబ్లూ 61(2) అఫ్ బీఎన్ఎస్, 231,238,240, 242,249 ఆర్/డబ్ల్యూ 49బిఎన్ఎస్ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. -
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు
-
పోలీసు కస్టడీకి సీదిరి అప్పలరాజు..
-
అడుగు బయటపెడితే చాలు.. నన్ను ఆపడం మీ తరం కాదు..
-
సుబ్బారెడ్డిని జైలులో బాబు కలవలేదా? ఈ కూటమి ప్రభుత్వానికి దిపావళి ముందే వచ్చేసింది..
-
దుర్మార్గానికి హద్దు లేదా?
అప్పలరాజు కొడుకుపై హత్య కేసు పెట్టడం క్షమించరాని తప్పు. యాక్సిడెంట్ జరిగి నప్పుడు ఈ పిల్లాడు తొలుత ఫోన్ చేసింది 108కే. ఈ అబ్బాయికి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108కు ఎందుకు ఫోన్ చేస్తాడు? బాధితుణ్ని కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాడు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే. చంద్రబాబు గారూ.. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే ఇలానే చేస్తారా? వాళ్ల పిల్లలు కానీ, వారి బంధువులు కానీ యాక్సిడెంట్ చేస్తే, వాళ్లు కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే.. మొత్తం కుటుంబంపై ఇదే మాదిరిగా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, కుట్ర కోణం, హత్య కోణం అని చెబుతారా? ఈ ఘటన జరిగాక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించి అంత రాజకీయం చేయడం దారుణం. చంద్రబాబూ.. నీవు అసలు మనిషివా? రాక్షసుడివా? అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనిషి అనే వాడికి మనసు ఉండాలి. ఏ ఇన్సిడెంట్ అయినా సరే వదలకూడదు.. దాన్ని ట్విస్ట్ చేయాలి.. వక్రీకరించాలి.. ఎవరినైనా నాశనం చేయాలి.. అన్న ఆలోచన నీది. నీ రాజకీయ అవసరాల కోసం అలా ఆలోచించడం దుర్మార్గం అనిపించడం లేదా? చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్లని ఇబ్బంది పెట్టడం మామూలైంది. ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం వాళ్ల మీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు. అలా వాళ్ల జీవితాలు నాశనం అవుతాయన్న కనీస జ్ఞానం లేకుండా చెలగాటాలు. ఇవీ చంద్రబాబు ప్రభుత్వంలో మనం చూస్తున్న వాస్తవాలు. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే, దాన్ని హత్య కేసుగా మార్చడం అత్యంత హేయమని, చంద్రబాబు దిగజారిన దారుణ రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ కేసులో మాజీ మంత్రి అప్పలరాజును ఇరికించి జైలుకు పంపడం ఆ కుటుంబంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు చేసిన రోడ్డు ప్రమాదాల్లో కూడా ఇలాగే వ్యవహరించారా.. అని సూటిగా ప్రశ్నించారు. అప్పలరాజు కుటుంబానికి పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటామని, ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ఇంకా గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు వద్ద జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం ఆయన ఇక్కడకు వచ్చారు. అక్కడే ఉన్న అప్పలరాజు భార్య, ఇద్దరు కుమారులను ఓదార్చారు. అప్పలరాజుకు న్యాయం జరుగుతుందని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. యాక్సిడెంట్‌ను ట్విస్ట్ చేసి.. కుట్ర ‘ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తున్నారో చూడండి. కనీసం మానవతా విలువలు లేకుండా, మంచితనం అన్నదానికి పూర్తిగా పాతర వేస్తూ, ఈ పిల్లాడిపై కుట్ర చేశారు. తనకు కేవలం 18 ఏళ్లు. ఒక నెల కిందట ‘నీట్’ పరీక్ష రాశాడు. వాళ్ల నాన్న మాదిరిగా తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని ఆరాట పడుతున్నాడు. పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే, దానిని ట్విస్ట్ చేసి.. అందులో కుట్ర కోణం యాడ్ చేసి, హత్య చేశాడని కేసు పెట్టారు. హత్యాయత్నం నుంచి హత్య చేశాడని కేసును ట్విస్ట్ చేశారు. అలా అప్పలరాజు కుటుంబాన్ని వేధించడం ఎంత వరకు ధర్మం? సమాజంలో ప్రతి ఒక్కరు దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ అనేది ఉద్దేశ పూర్వకంగా చేసేది కాదు. 45 ఏళ్ల గొర్రెల కాపరి రోడ్డు మీద గొర్రెలను తోలుకుంటూ పోతుండగా బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో కుట్ర కోణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది హత్య అవుతుందా? ఈ పిల్లాడికి ఆ మనిషి ఎవరో కనీస పరిచయం కూడా లేదు. అతడు పాదచారి మాత్రమే. దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని పట్టుకుని, ఈ పిల్లాడి జీవితం నాశనం చేయాలన్న ఆలోచన చేయడం ఎంత వరకు ధర్మం? ఇది కరెక్టేనా? రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం అప్పలరాజు బీసీల్లో ఒక మంచి నాయకుడు కాబట్టి, ఆయన వైఎస్సార్సీపీకి చెందిన నాయకుడు కాబట్టి ఇలా వేధిస్తున్నారు. నిజంగా, ఒక పిల్లాడు చేసిన యాక్సిడెంట్‌ను ఒక కుట్రగా, హత్యగా చిత్రీకరించి.. అప్పలరాజు కుటుంబాన్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ ఆలోచించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి, తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. దాన్ని చివరకు పోలీసులు కేసుగా మార్చేస్తారు. ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఓ లోకేశ్, వీళ్లకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్లకి సంబంధించిన పోలీసులు.. ఇదొక మాఫియా సామ్రాజ్యం. అప్పలరాజు బీసీ నాయకుడు కాబట్టే.. అప్పలరాజు 10వ తరగతిలో రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంకర్. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవార్డు కూడా ఇచ్చాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి.. తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేశ్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్‌ఫోర్డ్‌లో సీటు తెచ్చుకోలేదు. ఎండీ కూడా చేశాడు. అంటే మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒక మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వైఎస్సార్సీపీ తరఫున టికెట్ ఇస్తే, ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే అయ్యాడు. మంత్రిగా కూడా పని చేశాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇంతగా ఎదిగిన ఆయన వ్యక్తిత్వ హననం కోసం, ఒక తప్పుడు కేసు పెట్టారు. ఒక యాక్సిడెంట్‌ను కుట్రగా, హత్యగా వక్రీకరించారు. ఆయన కెరీర్‌ను నాశనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచన. ఆ దుర్మార్గపు ఆలోచనల్లో కనీసం ఈ 18 ఏళ్ల పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా చంద్రబాబు ఆలోచించ లేదు. 80 ఏళ్ల వయసు వస్తోన్న ఈ మనిషి అన్నం తింటున్నాడా? లేక గడ్డి తింటున్నాడా? అని అడుగుతున్నా. ఇది రాజకీయాలను ఒక నీచమైన స్థాయికి తీసుకుపోవడం. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే.. వాళ్ల పిల్లలు కానీ, వారి బంధువులు కానీ యాక్సిడెంట్ చేస్తే, వాళ్లు కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే.. మొత్తం కుటుంబంపై ఇదే మాదిరిగా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, కుట్ర కోణం, హత్య కోణం అని చెబుతారా? అని చంద్రబాబును అడుగుతున్నా. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఇదే శ్రీకాకుళం జిల్లాలో 2024 డిసెంబరు 31న జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ కొడుకు యాక్సిడెంట్ చేస్తే, కేసులో ఆయన్ను తప్పించి డ్రైవర్‌ను పెట్టారు. అది కూడా ఇదే జిల్లాలో జరిగింది. మరి అక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు? ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం వర్తింప చేస్తే, నిజంగా వ్యవస్థ అనేది బతకదు. మీరు చెడు విత్తనాలు నాటుతున్నారు. ఆ చెడు విత్తనాలు రేపు వృక్షాలై మొత్తం వ్యవస్థను నాశనం చేస్తాయి. 108కు ఎందుకు ఫోన్ చేశాడు? అప్పలరాజు కొడుకుపై హత్య కేసు పెట్టడం క్షమించరాని తప్పు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ పిల్లాడు తొలుత ఫోన్ చేసింది 108కే. ఈ అబ్బాయికి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108కు ఎందుకు ఫోన్ చేస్తాడు? బాధితుణ్ని కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాడు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే. ఇక్కడ ఎవరూ కూడా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కప్పిపెట్టాలనో, ఇంకొకటి చేయాలనో చూడలేదు. ఎవరూ కావాలని ఏ తప్పూ చేయలేదు. యాక్సిడెంట్‌ను రాజకీయం చేసే దుర్మార్గపు ఆలోచన యాక్సిడెంట్‌ను రాజకీయం చేయడం కోసం వీళ్లు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే.. చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ యాక్సిడెంట్లో ఒక గొర్రెల కాపరి మరణిస్తే, దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు ఏం చేశాడు? పార్థసారథి అనే ఒక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించాడు. ఆయన ఇక్కడికి వచ్చి ర్యాలీలు చేయించాడు. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర. ఇది ధర్మమేనా? దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంపై నిజంగా మనసు ఉన్నోళ్లు ఏం చేస్తారు? ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతారు. నష్టపరిహారం ఇప్పిస్తామని చెబుతారు. కుటుంబాన్ని అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి, భరోసా ఇప్పిస్తారు. ఇక్కడ అప్పలరాజు నిజంగా ఆ పని చేయడానికి ముందుకొచ్చాడు. అయితే వీళ్లు రాజకీయం చేసి, చెడగొట్టి, వాళ్లకు జరిగే మంచి కూడా జరగనీయకుండా చేస్తున్నారు. చంద్రబాబూ.. మనిషివా? రాక్షసుడివా? ఒక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించి అంత రాజకీయం చేయడం దారుణం. చంద్రబాబూ.. నీవు అసలు మనిíÙవా? రాక్షసుడివా? అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనిషి అనే వాడికి మనసు ఉండాలి. ఏ ఇన్సిడెంట్ అయినా సరే వదలకూడదు.. దాన్ని ట్విస్ట్ చేయాలి.. వక్రీకరించాలి.. ఎవరినైనా నాశనం చేయాలి.. అన్న ఆలోచన నీది. నీ రాజకీయ కోణం, నీ రాజకీయ అవసరాల కోసం అలా ఆలోచించడం దుర్మార్గం అనిపించడం లేదా? ఇది ఏ మాత్రం క్షమార్హం కాదు. యాదవుల మీద ప్రేమ ఉందా? యాదవుల మీద చంద్రబాబునాయుడుకు నిజంగానే ఇంత ప్రేమ ఉందా? ఏ మాత్రం లేదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తుంటే, కొన్ని గొర్రెలు పొలాల్లోకి పోతే, చంద్రబాబునాయుడుకి సంబంధించిన వాళ్లు వచ్చి యాదవులను కొట్టారు. కేసు మాత్రం యాదవుల మీద పెట్టారు. విశాఖపట్నం మేయర్‌గా మా పార్టీ నుంచి ఒక యాదవ మహిళ ఎన్నికయ్యారు. మరి చంద్రబాబు ఏం చేశారు? ఆయనకు తగిన సంఖ్యా బలం లేకపోయినా ప్రలోభాలతో ఆమెను పదవి నుంచి దింపేశాడు. విశాఖపట్నంలో యాదవ భవన్ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూమి ఇచ్చింది. అక్కడ భూమి పూజ జరిగి, పనులు కూడా మొదలయ్యాయి. చంద్రబాబు వచ్చాక అన్నీ క్యాన్సిల్ చేశాడు. ఇదీ చంద్రబాబుకు యాదవులపై ఉన్న ప్రేమ. బాబుకు బీసీలంటే చులకన » చంద్రబాబుకు ఒక్క యాదవులే కాదు. అసలు బీసీలు అంటే కూడా లెక్క లేదు. పోనీ మత్స్యకారుల మీద ఏమైనా ప్రేమ ఉందా అంటే అదీ లేదు. మత్స్యకార నాయకులను నాశనం చేయడం, కుట్రలు పన్ని వాళ్లను చరిత్ర హీనులుగా చేయడం అలవాటు. » ఇటీవల విశాఖపట్నం వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్లో ఆరుగురు చనిపోతే, కనీసం మానవత్వం చూపలేదు. ఒక మంత్రి కూడా ఆ కుటుంబాల వద్దకు పోలేదు. కానీ, జగన్ వెళ్లాడు. కలిశాడు. నిజం చెప్పాలంటే ఈ మనిషి (చంద్రబాబు)కి ఎవరి మీద ప్రేమ లేదు. పేదవాడి మీద అసలు ప్రేమే లేదు. ఈ మనిషి బీసీలను ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప, వారిపై ఏ మాత్రం ప్రేమ లేదు. » ఆయనకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం ఎందుకు అమలు చేయడం లేదు? దాని వల్ల అందరి కన్నా ఎక్కువగా నష్టపోయేది బీసీలే. ఒక్కసారి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో చూడండి. సున్నా వడ్డీని రూ.మూడు లక్షలు కాదు, రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. రెండేళ్లు అయ్యింది. మూడో సంవత్సరం వచ్చింది. ఇంతకు ముందు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ కూడా రద్దు చేశారు. » పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయాయి. రూ.25 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్ల వరకు మా ప్రభుత్వ హయాంలో తీసుకుపోతే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తం రూ.39 వేల కోట్లకు తగ్గిపోయింది. చేయూత లేదు. ఆసరా లేదు. సున్నా వడ్డీ లేదు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.9 వేల కోట్లు, వసతి దీవెన మొత్తం బకాయిలు పెట్టారు. దీంతో పిల్లలు చదువు మానేస్తున్న పరిస్థితి. దీంట్లో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది బీసీలే. సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్ సెవెన్లు లేవు ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చాడు. చదువుకున్న పిల్లలకు రూ.36 వేలు అని, అమ్మ కనపడితే నీకు రూ.18 వేలు అని, 50 ఏళ్లు దాటిన వారు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని నమ్మించాడు. ఎంత మంది ఉంటే అంత మందికీ అమ్మ ఒడి కింద రూ.15 వేలు దేవుడెరుగు. ఇచ్చింది రూ.9 వేలు. రూ.8 వేలు. సూపర్ సిక్స్‌లు లేవు, సూపర్ సెవెన్లు లేవు.అన్నీ అమ్మేస్తున్నాడు మత్స్యకారుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్లాన్ చేసి నిర్మాణాలు మొదలుపెట్టాం. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బుడగట్లపాలెం మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ ఎవరు తీసుకొచ్చారు? మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే స్కాములు చేస్తూ దాన్ని అమ్మకానికి పెట్టాడు. ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి పెట్టి మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం చేయడానికి ఈ మనిషి సిద్ధంగా ఉన్నాడు.ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు » చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్లని ఇబ్బంది పెట్టడం మామూలైంది. ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం వాళ్ల మీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు. అలా వాళ్ల జీవితాలు నాశనం అవుతాయన్న కనీస జ్ఞానం లేకుండా చెలగాటాలు. ఇది చంద్రబాబు ప్రభుత్వంలో మనం చూస్తున్న వాస్తవాలు. » నేను ఒకటే చెబుతున్నా. అప్పలరాజు కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. తోడుగా ఉంటుంది. నా చెల్లెలైన అప్పలరాజు భార్యకు అన్ని రకాలుగా వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా కచ్చితంగా త్వరలో బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి. ఆయన బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుంది. » విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు భారీగా జనం వచ్చారు. ఆ జన సందోహంలో కాన్వాయ్ కదలడం కష్టంగా మారింది. కాబట్టి జైలు దగ్గరకు చేరుకునే సరికి ములాఖత్ సమయం ముగిసిపోయింది. అందుకే ఇక్కడే ఉన్న అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాను. అప్పలరాజు భార్య, ఇద్దరు కుమారులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. భరోసా ఇచ్చాను’ అని వైఎస్ జగన్ అన్నారు. -
జగన్ వెంట జన సాగరం
సాక్షి, విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, అరసవల్లి: అడుగడుగునా ఖాకీలను మోహరించి చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకున్నా లెక్క చేయకుండా జన సముద్రం పోటెత్తింది! పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూసినా కుయుక్తులు పారలేదు. విశాఖ నుంచి సిక్కోలు దాకా జనవాహిని ఉప్పొంగింది. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి చోటా ఘన స్వాగతం పలికారు. అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖలో ఉదయం 11 గంటలకు బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం మండలంలోని అంపోలు జైలు వద్దకు చేరుకోగలిగింది. 120 కిలోమీటర్ల దూరానికి ఆరున్నర గంటలు పట్టిందంటే జనం తాకిడి.. జగన్‌పై ఉన్న అభిమానం ఏ స్థాయిలో పోటెత్తిందో అర్థం చేసుకోవచ్చు. తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం జంక్షన్, అడవివరం, సత్తరువు జంక్షన్, నీలకుండీలు, ఆనందపురం జంక్షన్, తగరపువలస మీదుగా శ్రీకాకుళం వైపు సాగింది. విశాఖ జిల్లాలోనే సుమారు మూడు గంటల పాటు సాగింది. దారి పొడవునా శ్రీకాకుళం దాకా ఎటు చూసినా జనమే. కాన్వాయ్‌ని ముందుకు కదలనివ్వకుండా జన ప్రవాహం కొనసాగింది. మధ్యాహ్నం 1:35 గంటలకు కాన్వాయ్ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. వైఎస్ జగన్ పర్యటనలో యువత, మహిళలు పెద్ద ఎత్తున కనిపించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పోలీసులు కవ్వింపు చర్యలకు దిగారు. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరినీ అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని గదమాయించారు. లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో చాలా మందికి గాయాలయ్యాయి. కానీ ఖాకీలు ఎంతగా అడ్డుకున్నా జన ప్రవాహాన్ని నిరోధించలేక చివరకు చేతులెత్తేశారు. వెల్లువెత్తిన వినతులు విశాఖ విమానాశ్రయంలో సుమారు 160 మంది ఎయిర్పోర్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వైఎస్ జగన్‌ను కలసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాకాణి నగర్ వద్ద విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన కాందిశీకులు వైఎస్ జగన్‌ను కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అడవివరం జంక్షన్ (భీమిలి) వద్ద పంచగ్రామాల భూ సమస్యపై స్థానికులు మాజీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఆనందపురం జంక్షన్ వద్ద గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కోసం తమ వద్ద నుంచి సేకరించిన డీ–పట్టా భూములకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి చెందిన బీసీ, ఎస్సీ రైతులు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పోటెత్తిన మత్స్యకారులు...: మత్స్యకార కుటుంబానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజకీయాల్లో ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయడంపై మత్స్యకారులు రగిలిపోతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం, కోష్ట తదితర తీర ప్రాంతాల నుంచి వందలాది మత్స్యకార కుటుంబాలు జగన్ పర్యటనలో పోటెత్తాయి. అంపోలు ప్రాంతానికి గార, శ్రీకాకుళం రూరల్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందిన మత్స్యకారులు స్వచ్ఛందంగా తరలివచ్చి అప్పలరాజుకు మద్దతుగా జగనన్నను కలిసి తమ ఆవేదన తెలియచేశారు. పోలీసుల ఆంక్షలు.. కాలి నడకన నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన పొడవునా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిరోధించేందుకు యత్నించినా అభిమానం ముందు ఆ ఆంక్షలు నిలవలేదు. రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, నాయకులు నేతలు కాలినడకనే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంబోత్సవం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించిన పోలీసు బలగాలను శ్రీకాకుళం జిల్లాకు డంప్ చేశారు. రెండు వేల మందికి పైగా పోలీసులను జాతీయ రహదారి పొడవునా, ప్రతి గ్రామ శివారులో కాపలా పెట్టారు. వైఎస్ జగన్ పర్యటన సాగే శ్రీకాకుళం, రణస్థలం, పైడి భీమవరం, కొత్తరోడ్డు, పెదపాడు వైపు రావద్దని ప్రజలను హెచ్చరించారు. అయినా జనం వెనక్కి తగ్గలేదు. జగన్ వెంటే సాగారు. వైఎస్ జగన్ వారిని నిరాశ పరచకుండా అభివాదం చేస్తూ, కరచాలనాలు అందిస్తూ, వినతులు స్వీకరిస్తూ ముందుకు కదిలారు. ఆయన కేవలం 8 వాహనాల కాన్వాయ్‌తో మాత్రమే వెళ్లి సీదిరి అప్పలరాజును కలిసేందుకు అనుమతించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా జైలు వద్దకు చేరుకునే సరికి సమయం మించిపోయింది. దీంతో జైలు ఆవరణలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి, కుమారులు ఆరవ్ వర్మ, అర్నవ్ వర్మ, అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఇతర కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అంబులెన్సులు, అంతిమయాత్ర వాహనాలను సైతం అడ్డుకుని..నలుమూలల నుంచి తరలి వస్తున్న పార్టీ శ్రేణులతో పాటు కీలక నేతల కార్లను గురువారం ఉదయం నుంచి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో ప్రయాణించేందుకు సైతం నిరాకరించారు. కొత్తరోడ్డులో అంతిమయాత్ర వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. క్షతగాత్రులను తరలిస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో విడిచిపెట్టారు. వజ్రపుకొత్తూరు మండలం నరేంద్రపురం వద్ద మహిళలను ఆస్పత్రులకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డగించారు. రాగోలు వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు.ఎచ్చెర్ల రోడ్డు నవభారత్ జంక్షన్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట స్థానిక నేతల వాహనాలు వెళ్లకుండా జాతీయ రహదారిని గంట సేపు దిగ్భందించారు. అంపోలు కూడలిలో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు ఉన్నారు. వీరంతా జగన్‌కు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. -
బుర్ర పనిచేస్తుందా బాబు? CPR ఎందుకు చేస్తాడు.. బాబుకు జగన్ కౌంటర్
-
వెళ్తూ.. వెళ్తూ.. చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
సీదిరి అప్పలరాజుని నాశనం చేయడం కోసం... జగన్ సంచలన కామెంట్స్
-
సీదిరి అక్రమ అరెస్ట్ పై YS జగన్ రియాక్షన్
-
జగన్ కీలక ప్రెస్ మీట్ @శ్రీకాకుళం
-
అంపోలు జైలు వద్ద YS జగన్ ప్రెస్ మీట్
-
జైలులో సీదిరి కుటుంబంతో బొత్స
-
వైఎస్ జగన్ రాకతో ఉత్తరాంధ్ర జనసంద్రం (ఫొటోలు)
-
చంద్రబాబూ.. మీ పార్టీ నేతలపై ఇలాంటి కేసులు ఎప్పుడైనా పెట్టారా?
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వెళ్లనున్నారు. పోలీసుల ఆంక్షలు, రాజకీయ వేడెక్కిన నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాలు ఎప్పటికప్పుడు ఇక్కడే.. -
సీదిరి అప్పలరాజుకు జగన్ పరామర్శ
-
టార్గెట్ సీదిరి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నేరపూరిత హత్య..నేర పూరిత కుట్ర.. తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం.. సాక్ష్యాలను మాయం చేయడం..నేరస్తుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం.. అబద్ధమని తెలిసినా సమాచారాన్ని అధికారులకు ఇవ్వడం.. నేరానికి ప్రేరేపించడం..’ఇవీ రోడ్డు ప్రమాదం కేసులో సంబంధం లేని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మోపిన అభియోగాలు. అసలు యాక్సిడెంట్ సమయంలో అప్పలరాజు అక్కడ లేరు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని వెళ్లిన అప్పలరాజే పోలీసులకు సమాచారం అందించారు. అలాంటప్పుడు అప్పలరాజుపై అభియోగాలు మోపడం రాజకీయ కుట్ర కాకపోతే ఏమనాలి.. కక్ష సాధింపులో భాగమని అనడానికి ఇంకేం చెప్పాలి.. రోడ్డు ప్రమాదంలో దానయ్య చనిపోవడానికి కారణం సిద్ధార్ద్ త్యాడి కాదని, సీదిరి తనయుడు ఆరవ్ వర్మ కారకుడని పోలీసులు అప్పలరాజుకు చెప్పివుంటే, ఆ తర్వాత కూడా కొడుకును తప్పించడానికి త్యాడిని ఇరికించి ఉంటే కచ్చితంగా నేరమవుతుంది. లేదూ దానయ్య మరణాన్ని దాచేసి అసలు అటువంటిది జరగలేదని బుకాయిస్తే అది ఇంకా పెద్ద నేరమవుతుంది. కానీ, సీదిరి కుమారుడు ఆరవ్ ఫోన్ నుంచే సంఘటన స్థలం నుంచి 108కు ఫోన్ వెళ్లింది. ఇక సీసీ టీవీలు ప్రైవేటు వ్యక్తులవే అయినా అందులో ఫుటేజ్ ఏమాత్రం పోలేదు. అలాంటప్పుడు ఇందులో హత్య కోణం ఎక్కడుందో పోలీసులు..వారిని ప్రేరేపించిన పాలకులే చెప్పాలి. ఇన్ని సెక్షన్లా? సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. న్యాయ కోవిదులు కూడా పోలీసుల తీరును ఆక్షేపిస్తున్నారు. యు/ఎస్ 105 ఆర్/డబ్లూ 61(2) అఫ్ బీఎన్ఎస్, 231,238,240, 242,249 ఆర్/డబ్ల్యూ 49బిఎన్ఎస్ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. పాలకులు కావల్సినట్టు పోలీసులు వ్యవహరించారని స్పష్టమవుతుందంటూ ఆరోపణలు ఉన్నాయి. 41 నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాల్సిన ఘటన కేసులో తొలుత కుమారుడిని, ఆ తర్వాత తండ్రిని అరెస్టు చేశారంటే ఎంత క«థ నడిచిందో అర్ధమవుతోంది. చంద్రబాబు అండ్‌కో పగ.. వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది. సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు. -
సీదిరి అప్పలరాజును కూటమి ఎందుకు టార్గెట్ చేసింది
-
సీదిరి అప్పలరాజుకు జగన్ పరామర్శ
-
ఈనెల 30న శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు సిద్ధమయ్యారు. గురువారం (జులై30) శ్రీకాకుళం వెళ్లనున్న జగన్.. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు.సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా జగన్ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జైలుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యం, భరోసా కల్పించడంతో పాటు.. కార్యకర్తలకు తాము అండగా ఉన్నామనే సందేశాన్ని జగన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అప్పలరాజు అరెస్టుపై వైఎస్సార్సీపీ ఆగ్రహంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పెట్టిన కేసు రాజకీయ కక్షతోనేనని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని మండిపడుతున్నారు. యాక్సిడెంట్ కేసును.. హత్య కేసుగా మార్చడం, అందులో సీదిరిని ఏ3గా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనపై ఆసక్తిజగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి అరెస్టు అంశంపై పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడంతో పాటు.. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకర్తలతోనూ ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


