సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ కేసులో అరెస్టై 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పారు.
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సీదిరి అప్పలరాజుకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పి, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.


