మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ | Former Minister Seediri Appalaraju Granted Bail | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్

Aug 14 2026 4:40 PM | Updated on Aug 14 2026 5:33 PM

Former Minister Seediri Appalaraju Granted Bail

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజురైంది. సీదిరి అప్పలరాజుకు సోంపేట కోర్టు.. ఇవాళ(శుక్రవారం) బెయిల్ మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్‌ చేయించిన సంగతి తెలిసిందే.

సీదిరి అప్పలరాజుపై పెట్టిన కేసు రాజకీయ కక్షతోనేనని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. యాక్సిడెంట్‌ కేసును.. హత్య కేసుగా మార్చడం, అందులో సీదిరిని ఏ3గా చేర్చి.. కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగింది.

వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది.

సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్‌లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు.

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

కాగా, సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. యు/ఎస్‌ 105 ఆర్‌/డబ్లూ 61(2) అఫ్‌ బీఎన్‌ఎస్, 231,238,240, 242,249 ఆర్‌/డబ్ల్యూ 49బిఎన్‌ఎస్‌ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement