సాక్షి,ఢిల్లీ: అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తామని తెలిపింది. రైతులకు అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొంది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షానే అత్యున్నత ధర్మాసనం ఉంటుందని స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ చట్టాలపై అభ్యంతరాలుంటే రైతులు కోర్టులను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది.


