సాక్షి, విజయవాడ: ప్రభుత్వ టీచర్ల పై నారా లోకేష్ రెడ్ బుక్ కక్ష సాధింపులకు దిగింది. ముగ్గురు టీచర్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినందుకు టీచర్లను బాబు సర్కార్ సస్పెండ్ చేసింది.
లక్షలాదిమంది ఉపాధ్యాయుల సమస్యపై కేంద్రమంత్రికి విన్నవించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే, వారితో వెళ్లారని ముగ్గురు ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. సంగమేశ్వర రెడ్డి, అమరనాథ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కడప డీఈవో.. తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారు. డీఎస్సీ అక్రమాల ర్యాలీలో పాల్గొన్నారంటూ తప్పుడు అభియోగాలతో సస్పెన్షన్ చేశారు. విద్యాశాఖలో టీచర్లపై రెడ్ బుక్ ప్రయోగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.


