అమెరికాలో భారతీయ మహిళ హత్య | Indian Origin Woman Incident In Us Store | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయ మహిళ హత్య

May 26 2026 11:56 AM | Updated on May 26 2026 12:01 PM

Indian Origin Woman Incident In Us Store

అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ స్టోర్‌లో గుజరాత్‌కు చెందిన భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. మృతురాలిని బిజాపుర్‌ ప్రాంతంలో మెహసానా జిల్లా జంత్రాల్‌ గ్రామానికి చెందిన మేఘనా పటేల్‌గా గుర్తించారు. మేఘ్నా పటేల్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. దుకాణం (స్టోర్) లోపల దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలో ఓ వ్యక్తి కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించడం కనిపించింది. ట్రాక్‌సూట్, జాకెట్, గ్లోవ్స్ , ఫేస్ మాస్క్ టోపీ ధరించి ఉన్న ఆ వ్యక్తి.. మేఘ్నా పటేల్‌తో కొద్దిసేపు మాట్లాడిన సెకన్ల వ్యవధిలోనే ఆమెపై కాల్పులు జరిపాడు.

ఆ తర్వాత అతను టేబుల్ పైనుంచి ఏదో తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం కనిపించింది. ఈ కాల్పులు దోపిడీ ఉద్దేశంతోనే జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement