మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్రామ నేపథ్యం నుంచి విదేశాలకు వలస వెళ్లి విజవయంతంగా స్థిరపడ్డాయి. వారిలో కొందరు తమ మూలాలను చూసుకునేందుకు వెనక్కి వచ్చి మరి భారతగడ్డపై అడుగుపెడుతుంటారు. పైగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలు, తమ పూర్వీకుల ఇళ్లను చూసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. నిజంగా నాడు వాళ్లు అభివృద్ది చెందాలని కష్టపడి ఉండకపోతే..తాము అక్కడ ఉండే వాళ్లం కాదన్న ఆలోచన ఉబ్బితబ్బిబైలా చేయడమే కాదు సగర్వంగా అనిపిస్తుంది. అలాంటి భావోద్వేగాన్నే పొందాడు ఈ భారత సంతతి వ్యక్తి. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
అసలేం జరిగిందంటే..గోల్డ్ వాటర్ వ్యవస్థాపకుడు విజయ్ తిరుమలై అమెరికాలో రోడ్‌షోకు వెళ్లేమందు వార్షిక చిత్తిరై ఉత్సవం నిమిత్తం ఆలయ పునరుద్ధరణ పనుల కోసం తన తండ్రి గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన నాన్న, మామయ్యలు పెరిగిన ఇల్లు తదితరాలను గుర్తు చేసుకుంటూ..ఆ టైంలో ఇక్కడ కరెంట్ లేదు, నీటి సరఫరా లేదని చెప్పారు.
అయినప్పటికీ బాల్యంలో ఇక్కడే పాలిటెక్నిక్ చదవి ఈ చుట్టుపక్కలే ఆడుకుంటూ ఎంజాయ్ చేశారని అన్నారు. ఇక తన కుటుంబం ఏ స్థాయికి చేరుకుందో గుర్తుచేసుకుంటూ..తన కజిన్స్ , ఇతర కుటుంబసభ్యులు అమెరికాలో బే ఏరియా, టొరంటో తదితర ప్రాంతాల్లో స్టార్టప్లు, బిగ్‌టెక్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ కెరీర్ ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ..మమ్మల్ని మంచి స్థాయిలో స్థిరపడేలా పెంచినందుకు మా తల్లిదండ్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞతలని పోస్ట్‌లో పేర్కొన్నారు.
అలాగే తమ పూర్వీకుల ఇంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఇంటిలోనే తన తండ్రి, మామయ్యల బాల్యం సాగిందని చెప్పారు. అయితే నెటిజన్లు వలసలు, త్యాగాల ఫలితం ఉన్నత స్థాయికి ఎదగడంతో ముడిపడి ఉన్న కుటుంబ చరిత్రను ఈ ఇల్లు గుర్తు చేస్తుందని అన్నారు. మరొక నెటిజన్ శెభాష్ విజయం..ఒక తరం అభివృద్ధి చెందడం కోసం ఇంకో తరం కష్టపడి త్యాగాలు చేస్తుంది. ఇది అద్భుత కుటుంబ కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
Yesterday took some time off ( before i head off for a US road show) to visit my dad's village for the annual festival ( Chittirai) to the temple where we do our part for renovations etc
This is the house my dad and my uncles grew up, no electricity, no running water, nothing,… pic.twitter.com/S8ZohHFMLM— Vijay Thirumalai (@vijaythirumalai) May 18, 2026
(చదవండి: ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..)


