ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరి దశగా ఇటలీలోని రోమ్‌లో అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం షేర్ చేయగా లైక్‌ల సునామీ ఏర్పడింది. కేవలం రెండు,మూడు గంటల వ్యవధిలోనే 60 లక్షల పైచిలుకు లైక్‌లు వచ్చాయి.
ఈ 'మెలోడీ' ముచ్చట్లు మొదట ప్రధాని మోదీ షేర్ చేసిన ఫోటోలతో ప్రారంభమయ్యాయి. అంతేకాదు ప్రధాని మోదీ తనకు 'మెలోడీ' టాఫీల (చాక్లెట్ల) ప్యాకెట్‌ను బహుమతిగా ఇస్తున్న వీడియోను మెలోని స్వయంగా షేర్ చేశారు. ఆ వీడియోకు "బహుమతికి ధన్యవాదాలు" అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఆసక్తికరమైన వీడియోతో ఈ #Melodi మూమెంట్ మరోసారి పీక్స్‌కు చేరింది.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
;
जब मोदी... मिले... मेलोनी से 🔥
एक तो महिला
ऊपर से इटालियन
उससे भी आगे इटली की PM
और ये पलकें बिछाकार मेरे PM का इंतज़ार
सारी दुनिया की गांव में मिर्च बोने को ये
एक मिनट का वीडियो ही काफी हैँ रे बाबा ✍️ pic.twitter.com/vO8KFRmo6m— Deepak Sharma (@SonOfBharat7) May 20, 2026
"రోమ్‌లో ల్యాండ్ అయిన తర్వాత, డిన్నర్ సమయంలో ప్రధాని మెలోనిని కలిసే అవకాశం వచ్చింది. అనంతరం ప్రసిద్ధ కొలోసియం (Colosseum) ను సందర్శించాము. వైవిధ్యమైన అంశాలపై మా ఆలోచనలను పంచుకున్నాము" అని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.
రోమ్ నడిబొడ్డున ఉన్న 'కొలోస్సియం' ఒక ప్రసిద్ధ దీర్ఘవృత్తాకార యాంఫిథియేటర్ (పురాతన బహిరంగ ప్రదర్శనశాల). ప్రపంచంలోనే నిర్మించబడిన అతిపెద్ద పురాతన యాంఫిథియేటర్ ఇదే కావడం విశేషం.
Five Italians passionate about Indian dance, Svamini Atmananda Giri, Ms. Martina Meenakshi Argada, Ms. Lucrezia Maniscotti, Ms. Valeria Vespaziani, Ms. Rosella Fanelli performed ‘Trigalbandi’, which included Kuchipudi, Bharatanatyam and Kathak. It is wonderful to see Indian dance… pic.twitter.com/gWYKgNejBe
— Narendra Modi (@narendramodi) May 20, 2026
కాగా మంగళవారం ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీకి మెలోని నుండి ఘనస్వాగతం లభించింది. "నా స్నేహితుడికి రోమ్‌లోకి స్వాగతం!" అని మెలోని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. వీరిద్దరూ బుధవారం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీనికి ముందు, నవంబర్ 2025లో జరిగిన జి20 (G20) సదస్సు సందర్భంగా వీరిద్దరూ చివరిసారిగా సమావేశమయ్యారు.
ఇటలీ వీధుల రమణీయమైన దృశ్యాలతో "మెలోడీ" (Melodi) మీమ్స్‌కు తెరలేపిన మోదీ, మెలోనిల సాన్నిహిత్యం మరోసారి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. గతంలో కూడా వీరిద్దరూ ఈ 'మెలోడీ' మీమ్స్‌ను గుర్తించి, వాటిపై మోదీగా సరదాగా స్పందించారు.
ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన విశేషాలు
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్న వివరాల ప్రకారం, రోమ్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి భారతీయులు ఉత్సాహంగా, ఘనంగా స్వాగతం పలికారు. ఇటాలియన్ కళాకారులు ప్రదర్శించిన కథక్, కూచిపూడి, భరతనాట్యం వంటి రంగుల ప్రదర్శనలను ప్రధానమంత్రి వీక్షించారు.

ఇటాలియన్ సంగీతకారులు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అద్భుతంగా ఆలపించారు. సంతూర్, తబలా, బన్సూరి (ఫ్లూట్), సితార్ వాయిద్యాల కలయికతో భారతదేశ సంగీత వారసత్వాన్ని వారు ప్రతిబింబించారు. అలాగే ఇటలీలో భారతీయ సంగీతానికి ఆదరణ పెరుగుతోందని మోదీ పేర్కొంటూ... స్వాగత వేడుకల్లో 'హంసధ్వని' రాగాన్ని అద్భుతంగా పలికించిన ఇటాలియన్ కళాకారులు వాలెరియో బ్రూని (సంతూర్), లియో వెర్టున్ని (సితార్), సిమోన్ మట్టియెల్లో (బన్సూరి), ఫ్రాన్సెస్కో గెరార్డి (తబలా), నికోలో మెల్లోచి (బన్సూరి)లను అభినందించారు.
వారణాసి పెయింటింగ్ బహుమతి
ఈ పర్యటనలో ఇటాలియన్ చిత్రకారుడు జియాంపాలో తోమస్సెట్టిని మోదీ కలిశారు. తోమస్సెట్టి తాను గీసిన వారణాసి పెయింటింగ్‌ను మోదీకి బహుమతిగా ఇచ్చారు. తోమస్సెట్టికి భారతీయ సంస్కృతిపై నాలుగు దశాబ్దాలుగా ఉన్న మక్కువను మోదీ కొనియాడారు. 1980లలో వేద సంస్కృతికి సంబంధించిన పుస్తకాలకు ఇలస్ట్రేటర్‌గా కెరీర్ ప్రారంభించిన తోమస్సెట్టి, 2008 నుండి 2013 మధ్య కాలంలో మహాభారతానికి సంబంధించి 23 పెద్ద పెయింటింగులను రూపొందించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ


