మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ | Norwegian journalist says social media accounts suspended | Sakshi
Sakshi News home page

మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ

May 20 2026 11:49 AM | Updated on May 20 2026 12:43 PM

Norwegian journalist says social media accounts suspended

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో అనూహ్య ప్రశ్న సంధించి వార్తల్లో నిలిచిన నార్వే మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్  (Helle Lyng Svendsen) చేదు అనుభవం ఎదురైంది. ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను నిలిపివేస్తూ మెటా షాక్‌ ఇచ్చింది.  ఈ విషయాన్ని ఆమె  కూడా ధృవీకరించారు.


ఆన్‌లైన్‌లో వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలు నిలిపివేయబడ్డాయని హెలె లింగ్ ట్వీట్‌ చేశారు.  తన ఖాతా నిలిపివేయబడటానికి ముందు రోజంతా తన ఇన్‌స్టాను యాక్సెస్ చేయలేకపోయానని లింగ్ తెలిపారు. "పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యమే ఇది, కానీ ఇలాంటి అనుభవం ఇంతకు ముందెప్పుడూ ఎదురు కాలేదు," అని ఆమె తన సస్పెన్షన్ నోటీసు స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేశారు.

 ; మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వినియోగ దారులకు, తన ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఖాతాలు రెండూ సస్పెండ్‌ అయ్యాయని మరో పోస్ట్‌లో లింగ్‌ తెలియజేశారు. తాను  వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు స్పందించాలనుకున్నా, కానీ ఇప్పుడు అది లేట్‌ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.  కానీ తన ఖాతాలు తిరిగి యాక్టివ్‌ అవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన పోస్ట్‌కు ఆమె మెటాను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు.

ఇదీ చదవండి: ఇది కదా లక్‌ అంటే : పాత ప్యాంట్‌లో రూ. 57 కోట్ల జాక్‌పాట్‌
 

కాగా ప్రధాని మోదీ పత్రికా సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ బాగా వైరల్‌ అయింది. ఆమె ఫాలోవర్లు కూడా పెరిగారు. దీనిపై బీజేపీ శ్రేణులు  లింగ్‌పై విరుచుకుపడగా, నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement