బ్రిటన్‌లో ప్రవాస భారతీయల రికార్డు.. మేయర్లుగా తల్లీ తనయులు | Haryana Tushar becomes UK youngest Indian-origin mayor | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో ప్రవాస భారతీయల రికార్డు.. మేయర్లుగా తల్లీ తనయులు

May 25 2026 7:48 AM | Updated on May 25 2026 8:35 AM

Haryana Tushar becomes UK youngest Indian-origin mayor

లండన్‌: బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న తల్లీ, తనయుడు మేయర్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. వీరి కుటుంబం హర్యానాకు చెందినది.

వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్‌తక్‌ నుంచి పర్వీన్‌ రాణి కుటుంబం 2013లో బ్రిటన్‌కు వలస వెళ్లింది. పర్వీన్‌ రాణి కుమారుడు తుషార్‌ కుమార్‌ (23) లండన్‌లోని కింగ్స్‌ కళాశాలలో చదువుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో పీజీ పూర్తి చేసుకోనున్నారు. అయితే, పర్వీన్‌ రాణి, తుషార్‌ కుమార్‌ ఎన్నికల్లో పోటీ చేశారు.

ఈ క్రమంలో ఎల్‌స్ట్రీ అండ్‌ బోరమ్‌వుడ్‌ పట్టణ కౌన్సిల్‌కు తుషార్‌ మేయరుగా ఎన్నికయ్యారు. వారం రోజుల తర్వాత తుషార్‌ తల్లి పర్వీన్‌ రాణి హర్ట్స్‌మేర్‌ బరా కౌన్సిలుకు భారతీయ మూలాలున్న తొలి మేయరుగా ఎన్నికయ్యారు. ఇలా భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. ఇక, బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న అతి తక్కువ వయసు గల మేయర్‌గా తుషార్‌ చరిత్ర సృష్టించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement