న్యూయార్క్‌ టూర్‌ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం | Indian Teen Dies While To Save Mother Who Fell From Horse Carriage In US | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌ టూర్‌ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం

Jun 18 2026 5:53 PM | Updated on Jun 19 2026 11:33 AM

Indian Teen Dies While To Save Mother Who Fell From Horse Carriage In US

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బగ్గీ నుండి కింద పడి పోయిన తల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక భారతీయ యువకుడు  ప్రాణాలు కోల్పోయాడు. గుర్రం  అదుపు తప్పి ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడంతో  ఈ ప్రమాదం జరిగింది.

'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకారం కుటుంబంతో కలిసి న్యూయార్క్‌కు మొదటిసారి విహారయాత్రకు వచ్చిన 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్‌కు బుధవారం జీవితంలోని మర్చిపోలేని శోకాన్ని మిగిల్చింది. కుటుంబ ఫోటో తీసుకోవడానికి డ్రైవర్ బండిని ఆపిన వెంటనే, గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వేగంగా దూసుకెళ్లి ఫుట్‌పాత్ ఎక్కి, గడ్డి ఉన్న ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ‘‘రక్షించండి, రక్షించండి’’ అని అరుస్తూనే ఉన్నామని రోమాంచ్ తండ్రి దీపక్ మహాజన్ వాపోయారు. అందరమూ ఒకర్నొకరు గట్టిగా పట్టుకున్నప్పటికీ తన భార్య ప్రియ బగ్గీ నుండి కింద పడి పోవడంతో, ఆమెను రక్షించడానికి రోమాంచ్ కిందకు దూకి  చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు.

కిందకు దూకిన రోమాంచ్ తల నేలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. బుధవారం రాత్రి న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్‌లో చికిత్సపొందుతూ చని పోయాడు.  రోమాంచ్‌ తండ్రి తల్లి , తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

 టావెర్న్ ఆన్ ది గ్రీన్ అనే హోటల్‌లో పనిచేసే టాటియానా బ్రెస్లర్ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ, గుర్రం భయంతో  చాలా వేగంగా పరుగెత్తిందని, వెంటనే తాము 911కి ఫోన్ చేశారు. బగ్గీ బోల్తా పడకముందే ఒక ప్రత్యక్ష సాక్షి ఆ గుర్రాన్ని  కట్టడి చేశాడని బ్రెస్లర్ తెలిపారు.

ఇదీ చదవండి :  60 ఏళ్లకి లవ్‌, 75 రోజులకే పెళ్లి : నటి లవ్‌ స్టోరీ

గుర్రపు బగ్గీలతో జరుగుతున్న వరుస ప్రమాదాల్లో ఇది తాజాది. ఈ ప్రమాదంతో పార్కులో గుర్రపు బగ్గీలను నిషేధించాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. బగ్గీ డ్రైవర్ల యూనియన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. గత ఏడాది మే నుండి పార్క్ లేదా దాని పరిసరాల్లో గుర్రాలకు సంబంధించిన ప్రమాదాలు ఎనిమిది జరిగాయని, గత నెలలో కూడా ఒక గుర్రం మరో బగ్గీని ఢీకొట్టడంతో అది బోల్తా పడిందని పార్క్ కన్సర్వెన్సీ తెలిపింది. సదరు డ్రైవర్‌ను యజమాని నిరవధికంగా సస్పెండ్‌ చేశారు.

ఇదీ చదవండి: మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌ : తీవ్ర ఉద్రిక్తత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement