రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌ | Ukraine hits Moscow oil refinery again part of massive drone wave inside Russia | Sakshi
Sakshi News home page

రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

Jun 18 2026 5:21 PM | Updated on Jun 18 2026 9:16 PM

Ukraine hits Moscow oil refinery again part of massive drone wave inside Russia

మాస్కో: సంవత్సరాలుగా దాడులు కొనసాగుతున్నా.. ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదు. తాజాగా వందలాది డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కో, పరిసర ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ దాడులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.  

గత నెల రోజులుగా ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులను తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటోంది. గురువారం మాస్కోలోని కపోట్న్యా రిఫైనరీపై అతి పెద్ద డ్రోన్ దాడి జరిగింది. క్రెమ్లిన్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. డ్రోన్ శకలాలు భవనాలపై పడటంతో సమీపంలోని షాపింగ్ సెంటర్ తగలబడింది. అనేక నివాస భవనాలను ఖాళీ చేయించారు.

రష్యా రాజధాని చుట్టూ దాదాపు 200 డ్రోన్లు దాడి చేశాయి. ఒక పేలుడు ధాటికి చమురు నిల్వ ట్యాంక్ మూత డజన్ల కొద్దీ మీటర్ల ఎత్తుకు ఎగిరింది. మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ ప్రకారం, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి కారణంగా మాస్కో విమానాశ్రయాల్లో వాణిజ్య విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. 500కు పైగా విమానాలు రద్దయ్యాయి, మరికొన్ని ఆలస్యమయ్యాయి.

రష్యా ప్రతిస్పందన
24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 1,000 డ్రోన్లు, నాలుగు ఉక్రెయిన్ క్రూయిజ్ క్షిపణులను అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ రోస్టోవ్ ప్రాంతంలోని ఒక చమురు డిపోపై దాడి జరగగా, ఒకరు మరణించారు.

 

 

BIG: Ukraine launched its largest drone attack on Moscow in two years, with Russian officials saying air defenses intercepted 194 drones targeting the capital and 555 across Russia overnight. 

The strikes damaged infrastructure, sparked fires, and temporarily disrupted flights… pic.twitter.com/4LGWeXGAfN

— Clash Report (@clashreport) June 18, 2026

 ఉక్రెయిన్ సందేశం
ఈ యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని, రష్యా దౌత్యపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ ప్రధాని జెలెన్‌ స్కీ అన్నారు. గత వారం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన దాడికి ప్రతిస్పందనగా ఈ భారీ డ్రోన్ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ దాడిలో ఒక ప్రధాన మతపరమైన ప్రదేశం అగ్నికి ఆహుతైందని తెలిపారు. ‘మాకు ఈ యుద్ధం వద్దు, ఎప్పుడూ వద్దు. ఉక్రెయిన్ తగలబడితే, మీ మాస్కో కూడా తగలబడుతుంది’అని జెలెన్‌స్కీ హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement