భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..! | Indian origin MIT graduate Avani Ahuja received prestigious Henry Ford II Scholar Award | Sakshi
Sakshi News home page

భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!

Jun 4 2026 1:34 PM | Updated on Jun 4 2026 2:22 PM

Indian origin MIT graduate Avani Ahuja received prestigious Henry Ford II Scholar Award

భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్‌II స్కాలర్‌ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్‌లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్‌ అండర్‌ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. 

ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్‌లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌ఫర్‌ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్‌ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. 

నిజానికి హెల్త్‌కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. 

అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్‌ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్‌కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్‌డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్‌ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.

(చదవండి: నాడు నీట్‌ ఫెయిల్యూర్‌..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)

 

 

Advertisement
 
Advertisement
Advertisement