ఆరిజోనాలో డెమొక్రటిక్‌ ప్రైమరీ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న అమిష్‌ షా | Indian-American Amish Shah wins Democratic congressional primary in Arizona | Sakshi
Sakshi News home page

ఆరిజోనాలో డెమొక్రటిక్‌ ప్రైమరీ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న అమిష్‌ షా

Jul 24 2026 5:36 AM | Updated on Jul 24 2026 11:14 AM

Indian-American Amish Shah wins Democratic congressional primary in Arizona

వాషింగ్టన్‌: అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని పార్లమెంట్‌ దిగువసభ స్థానమైన ‘ఫస్ట్‌ కాంగ్రేషనల్‌ డి్రస్టిక్ట్‌’నియోజకవర్గం నుంచి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని భారతీయ మూలాలున్న వైద్యుడు అమిష్‌ షా గెలుపొందారు. నవంబర్‌లో ఈ స్థానానికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి జే ఫీలేతో అమిష్‌ షా తలపడనున్నారు. 48 ఏళ్ల అమిష్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం బుధవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన నాయకురాలు మార్లీన్‌ గాలన్‌ ఉడ్స్‌ను ఓడించి షా తన అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసుకున్నారు.

 డోర్‌–టు–డోర్‌ ప్రచారం ద్వారా దాదాపు 28,000 కుటుంబాలకు తన హామీ లు చేరేలా కృషి చేసి షా బుధవారం విజ యం సాధించారు. పార్టీ ప్రచారకమిటీ అయి న డెమొక్రటిక్‌ కాంగ్రెషనల్‌ క్యాంపెయిన్‌ కమిటీ(డీసీసీసీ) బలపరిచిన అభ్యర్థిని సైతం అమిష్‌ ఓడించడం విశేషం. ఆరిజోనా రాష్ట్ర చట్టసభకు అమిష్‌ గతంలో మూడుసార్లు ఎన్నికయ్యారు. అమిష్‌ గతంలో అమెరికాలోని ‘న్యూయార్క్‌ జెట్స్‌’ఫుట్‌బాల్‌ జట్టుకు వైద్యునిగా సేవలందించారు. 1960వ దశకంలో గుజరాత్‌ నుంచి అమెరికాకు వలసవచ్చిన భారతీయ జంటకు అమిష్‌ జన్మించారు. నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 

అదే వర్సిటీలోని వైద్యకళాశాలలో వైద్యశాస్త్రం అభ్యసించారు. తర్వాత న్యూయార్క్‌లోని ట్రామా సెంటర్‌లోని అత్యవసర వైద్యవిభాగంలో వైద్యునిగా సేవలందించారు. అమిష్‌ తండ్రి జైనమతంలో కొనసాగుతుండగా తల్లి హిందువుగా ఉన్నారు. అమిష్‌ ఈ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలవడం ఇది రెండోసారి. 2024లోనూ పార్టీ తరఫున సాధారణ ఎన్నికల్లో పోటీచేసినా రిపబ్లికన్‌ అభ్యర్థి డేవిడ్‌ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈసారి ఎలాగైనా అమెరికా దిగువసభలో అడుగుపెట్టాలని పట్టుదలతో ప్రయతి్నస్తున్నట్లు ప్రైమరీ గెలుపు తర్వాత అమిష్‌ మీడియాతో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement