జర్మనీలోని ఇన్‌గాల్‌స్ట్యాట్ నగరంలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లా పాల్గొన్న వైఎస్సార్సీపీ అభిమానులు, మద్దతుదారులు, తెలుగు ప్రజలు
సాక్షి, అమరావతి : మాట ఇస్తే మడమ తిప్పని నైజం.. కలిసిన ప్రతి ఒక్కరినీ పేరుతో పలకరింపు.. ఇలా ఎన్నో లక్షణాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని జననేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాయని వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి కార్తీక్ యల్లాప్రగడ కొనియాడారు. జర్మనీలోని ఇన్‌గాల్‌స్ట్యాట్ నగరంలో ఆదివారం వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించి భారీ కేక్‌ను కట్ చేశారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్తీక్ మాట్లాడుతూ.. జన సంక్షేమమే ధ్యేయంగా.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం.. ఇవన్నీ కలగలిపిన రూపం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ ఏపీ అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ కూడా తన ఐదేళ్ల పాలనలో తండ్రిని తలపించేలా పాలన అందించారని చెప్పారు. మాజీమంత్రి పేర్ని నాని, వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కో–ఆర్డినేటర్ సాంబశివారెడ్డి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు.
జర్మనీ, ఐర్లాండ్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీతో పాటు యూరప్‌లోని పలు దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. వైఎస్ ఆశయాలు, దార్శనికతను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ జర్మనీ కమిటీ అధ్యక్షుడు కృష్ణతేజారెడ్డి గడ్డం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నెదర్లాండ్స్ కన్వీనర్ శరత్‌రెడ్డి వంగా, ఐర్లాండ్ కన్వీనర్ ఆకేపాటి కిషోర్‌రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.


