నేడు నగరానికి శ్రీపతి దీపారెడ్డి పార్థివదేహం | 42-year-old software professional from Hyderabad | Sakshi
Sakshi News home page

నేడు నగరానికి శ్రీపతి దీపారెడ్డి పార్థివదేహం

Aug 2 2026 7:47 AM | Updated on Aug 2 2026 7:47 AM

42-year-old software professional from Hyderabad

హైదరాబాద్‌: చంపాపేట డివిజన్‌ శిఖరా ఎన్‌క్లేవ్‌ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.  దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.

గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్‌ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్‌ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. 

సంబరపడే లోపే..
రెండు రోజుల్లో మాదాపూర్‌లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్‌ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. 

నేడు చంపాపేటలో అంత్యక్రియలు 
దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement