అమెరికాలో మోసం... హైదరాబాద్‌లో కేసు! | Jubilee Hills man booked for cheating US investor | Sakshi
Sakshi News home page

అమెరికాలో మోసం... హైదరాబాద్‌లో కేసు!

Jun 28 2026 7:22 AM | Updated on Jun 28 2026 9:38 AM

Jubilee Hills man booked for cheating US investor

హైదరాబాద్‌:  అమెరికాలో వ్యాపారవేత్తను మోసం చేసిన సంఘటనలో జూబ్లీహిల్స్‌కు చెందిన క్రాంతి విస్తాకులపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) కేసు నమోదు చేసింది. అమెరికా వాసి కేసీ మీహాన్‌ తన జీపీఏ హోల్డర్‌ ద్వారా ఈ ఫిర్యాదు చేశారు. క్రాంతి తాను ’ధామా’ సంస్థల వ్యవస్థాపకుడినని, తమ వ్యాపార విలువ 10 మిలియన్‌ డాలర్లని నమ్మించి, మీహాన్‌ నుంచి 2016లో 50 వేల అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టించారు.

 ఏడాదిలోగా 10 శాతం వడ్డీతో అసలు తిరిగేస్తామని ప్రామిసరీ నోట్‌ రాసిచ్చిన, 0.5 శాతం ఈక్విటీ ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే గడువు తీరినా క్రాంతి డబ్బులు చెల్లించలేదు.  వడ్డీతో కలిపి క్రాంతి చెల్లించాల్సిన మొత్తం 1,05,846 డాలర్లకు (రూ.90 లక్షలు) చేరింది. కాగా, క్రాంతి అమెరికాలోని సంస్థను మూసేసి, ఇతర ఇన్వెస్టర్ల నిధులు కూడా దురి్వనియోగం చేసి భారత్‌కు పారిపోవడంతో బాధితుడు సీసీఎస్‌ను ఆశ్రయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement