న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్‌ని ఘనంగా సత్కరించారు.

ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు.


