TG: బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య | Btech Student Ends Her Life In Rangareddy District | Sakshi
Sakshi News home page

TG: బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Jul 24 2026 7:09 PM | Updated on Jul 24 2026 7:47 PM

Btech Student Ends Her Life In Rangareddy District

ప్రతీకాత్మక చిత్రం

రంగారెడ్డి:  మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురునానక్‌ కాలేజీలో బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న మానస అనే విద్యార్థిని ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంచితే, మణికొండలో అపార్ట్‌మెంట్‌ 10వ అంతస్తునుంచి దూకి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఫైనాన్షియల్‌ జిల్లా పుప్పాలగూడలో జరిగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జేపీ మోర్గాన్‌ చేజ్‌ అనే ఐటీ సంస్థలో మబ్బు విష్ణువర్దన్‌రెడ్డి(27) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. 

బుధవారం రాత్రి  విధులు ముగించుకుని  ఏఎస్‌బీఎల్‌ స్పెక్ట్రా అపార్ట్‌మెంట్‌ 10వ అంతస్తులోని తన ఫ్లాట్‌కు  వచ్చి పడుకున్నాడు. అయితే  గురువారం తెల్లవారు జామున గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement