వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్‌ తీసుకోవచ్చా? | NRI with Rs 46 crore asks if he can retire in India Goes Viral | Sakshi
Sakshi News home page

వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్‌ తీసుకోవచ్చా? ఎందుకంటే..

Jun 19 2026 12:46 PM | Updated on Jun 19 2026 2:30 PM

NRI with Rs 46 crore asks if he can retire in India Goes Viral

సోషల్‌ మీడియా పుణ్యమా అని తమకెదురైన ప్రతి సమస్యను షేర్‌ చేసుకుంటూ సలహాలు సూచనలు పొందడం ఓ ట్రెండ్‌గా మారింది. ఒకరకంగా దీనివల్ల ఇతరుల ఎంత పెద్ద సమస్యలు ఫేస్‌ చేస్తున్నారో తెలియడమేగాక, వ్యక్తిగతంగా ఒక సమస్యకు ఎలా సంయమనంగా ఓపిగ్గా ఉండాల్లో తెలుసుకునే వీలు లభించడం విశేషం. అలానే ఈసారి నెట్టింట వైరల్‌ అవుతున్న ఓ ఎన్నారై రెడిట్‌ పోస్ట్‌ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు ఆలోచింప చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..

ఆ ఎన్నారై రెడిట్‌ పోస్ట్‌లో ఇలా ఉంది. తన వయసు 39 ఏళ్లు అని, తాను దాదాపు 15 ఏళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చూసుకున్నానని, తామిద్దరం ఉద్యోగాల్లో మంచి ఉన్నతిని సాధించామని, సుమారు 46 కోట్లు ఆస్తులు ఉన్నాయని వెల్ల‌డించారు. అయితే ఇటీవల తన భార్య కేన్సర్‌ బారిన పడిందని, ప్రస్తుతం ఆ వ్యాధి మరింతగా ముదిరింద‌ని రాసుకొచ్చారు. తమకు పిల్లలు కూడా లేరని అన్నారు.

దాదాపు ఐదేళ్లుగా తర భార్య కేన్సర్‌తో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకవేళ ఆమె ఆరోగ్యం క్షీణించి.. దాంతో మానసికంగా అలిసిపోయి ఇక పనిచేయకూడదు రిటైర్మెంట్‌ తీసుకోవాలి అనుకుంటే.. భారత్‌లో జీవించడానికి తన వద్ద ఉన్న ఆ రూ. 46 కోట్ల ఆస్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు నెటిజన్ల నుంచి ఆచరణాత్మక ఆర్థిక సలహాలతో పాటు వ్యక్తిగత ధైర్యాన్ని నింపే సలహాలు సూచనలు కూడా అందించారు.

వినడానికి బాధగా ఉన్నా.. తక్షణమే ఉద్యోగానికి రిజైన్‌ చేసి ఆమె చెంతే ఉండండి. మంచి వైద్యం అందించేలా ప్రముఖ వైద్యులను కలిసి సలహాలు సూచనలు తీసుకోండి. భారత్‌లో మెట్రో నగరాల్లో జీవించాలనుకున్నా అంత మొత్తం సరిపోతుందని అన్నారు. అంతేగాదు మీ భార్య కోసం చేయగలిగిందంతా ఇప్పుడే చేయండి. ఇది ఆర్థిక భద్రతకు సంబంధించింది కాదు.. అంతకుమించిన బంధానికి, భావోద్వేగానికి సంబంధించిందంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.

చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement