కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే..! | Kangana Ranaut ₹6,100 Umbrella Steals The Show At Parliament, Here’s Why It’s So Special | Sakshi
Sakshi News home page

కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే..!

Aug 9 2026 11:53 AM | Updated on Aug 9 2026 1:30 PM

Kangana Umbrella Grabs Attention at Parliament, But Do You Know Its Price

ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటారు బాలీవుడ్‌ నటి, ఎంపీ కంగనా రనౌత్‌. తాజాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు హాజరైన ఆమె మరోసారి తన స్టైలిష్‌ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. 

అయితే ఈసారి ఆమె చీర, హ్యాండ్‌బ్యాగ్‌ కంటే చేతిలో పట్టుకున్న గొడుగే హైలైట్‌గా మారింది. సాధారణంగా వర్షం నుంచి రక్షణ కోసం ఉపయోగించే గొడుగును కూడా ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌గా మార్చేశారు కంగనా. ఇంతకీ ఆమె చేతిలో ఉన్న ఆ గొడుగు ప్రత్యేకత ఏంటి? దాని ధర ఎంతో తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే!

కంగనా రనౌత్‌ పార్లమెంట్‌ హౌస్‌కు వెళ్లే సమయంలో రంగురంగుల ప్రింటెడ్‌ గొడుగుతో కనిపించారు. సాధారణ నలుపు రంగు గొడుగులకు భిన్నంగా ఆమె చేతిలోని ఆక్వా కలర్‌ గొడుగు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. 

ఈ గొడుగును ప్రముఖ లగ్జరీ డిజైన్‌ హౌస్‌ గుడ్‌ ఎర్త్‌ రూపొందించిందట. దీని ధర రూ.6,100. అంటే గొడుగు కోసం ఆరు వేలకు పైగా ఖర్చు చేశారు కంగనా. చీర, బ్యాగ్‌తో పాటు రంగురంగుల గొడుగు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement