భాగ్యశ్రీకి బంపరాఫర్.. ఆ స్టార్‌ హీరో సరసన ఛాన్స్? | Bhagyashri Borse gets a Chance to Act In Star Hero Movie | Sakshi
Sakshi News home page

భాగ్యశ్రీకి బంపరాఫర్.. ఆ స్టార్‌ హీరో సరసన ఛాన్స్?

Aug 8 2026 11:23 PM | Updated on Aug 8 2026 11:23 PM

Bhagyashri Borse gets a Chance to Act In Star Hero Movie

అక్కినేని అఖిల్‌ హీరోగా వచ్చిన ‘లెనిన్’ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మరో క్రేజీ ఆఫర్ దక్కబోతున్నట్టు తెలుస్తోంది. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీకి వరుసగా క్రేజీ సినిమాలు వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. ‘లెనిన్’తో ఆమెకు తొలి సాలిడ్ హిట్ దక్కింది. ఈ సక్సెస్‌తో భాగ్యశ్రీ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు తమిళంలో కూడా  శివకార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement