‘‘ప్రేక్షకులు చాలా తెలివైనవారు. ఓ మూవీ ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు. కొత్తదనం కనిపిస్తే థియేటర్‌కు వస్తారు. సినిమా బాగుంటే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని ‘డీసీ’ మరోసారి నిరూపించింది. ప్రతి షోకి ఆదరణ పెరుగుతోంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని నిర్మాత డి. సురేష్ బాబు తెలిపారు. లోకేష్ కనగరాజ్ హీరోగా, వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డీసీ’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీని ఏషియన్ సినిమాస్ శుక్రవారం తెలుగులో రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘డీసీ’ అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ మూవీకి అన్ని ్ర΄ాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్క్రీన్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ విజయం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు నిర్మాత శిరీష్ రెడ్డి.


