‘కొరియన్‌ కనకరాజు’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ .. అన్ని కోట్లా? | Korean Kanakaraju Movie Box Office Collection Day 1 Details | Sakshi
Sakshi News home page

‘కొరియన్‌ కనకరాజు’.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..

Aug 8 2026 12:35 PM | Updated on Aug 8 2026 12:51 PM

Korean Kanakaraju Movie Box Office Collection Day 1 Details

చాలా రోజుల తర్వాత మెగాహీరో వరుణ్‌ తేజ్‌ డీసెంట్‌ హిట్‌ కొట్టాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’. నిన్న(ఆగస్ట్‌ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి..తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. కథగా చూస్తే ఈ హారర్‌ కామెడీ రొటీన్‌ అయినప్పటికీ.. కామెడీ సీన్లు వర్కౌట్‌ అయ్యాయని పలు వెబ్‌సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. అయితే టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లనే సాధించింది. 

(చదవండి: 'కొరియన్‌ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్)

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించిన మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్యకాలంలో వరుణ్‌ నటించిన చిత్రాలేవి ఫస్ట్‌డే ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టలేదనే చెప్పాలి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయర్‌ హీరోయిన్‌గా నటించింది. సత్య, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement