అమెరికాలోని ఓ షాపింగ్ మాల్‌లో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడితో చేశారు. హైదరాబాద్ టౌలిచౌకికి చెందిన సయ్యద్ సోహైల్‌పై ఓ దుండగుడు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దాడి ఘటన జులై 13న జరగ్గా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ సోహైల్.. వెస్ట్ వ్యాలీ సిటీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 37 ఏళ్ల సయ్యద్ సోహైల్.. గత రెండున్నరేళ్లుగా ఆ షాపింగ్ మాల్‌లో చిన్న వ్యాపార దుకాణం నిర్వహిస్తున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోకముందే, మాల్‌లోని కొందరు వ్యక్తులు దాడి చేసిన వ్యక్తిని నిలువరించి.. అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. నిందితుడిని పీటర్ మైఖేల్ లార్సెన్‌గా గుర్తించారు.
ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విన్నవిస్తూ.. ఈ సమస్యను అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తాము అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దాడి గురించి తెలిసి.. సోహైల్ భార్య అమ్రీన్ ఫిర్దౌస్ స్పృహతప్పి పడిపోయారు. ఈ దంపతులకు ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Indian stabbed in US over his religion
A 37-year-old Indian national Syed Sohailuddin was st*bbed more than 15 times at a kiosk inside Valley Fair Mall in West Valley City, Utah. Suspect Peter Michael Larsen, 48, allegedly told police he targeted the Muslim victim and intended… pic.twitter.com/6rso7E03XX— Piyush Rai (@Benarasiyaa) July 16, 2026


