ఆ ప్రచారం అబద్ధం: ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి | News Of His Son Arrest Is Not True: MLC Venkatrami Reddy | Sakshi
Sakshi News home page

ఆ ప్రచారం అబద్ధం: ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి

Jul 16 2026 5:31 PM | Updated on Jul 16 2026 6:15 PM

News Of His Son Arrest Is Not True: MLC Venkatrami Reddy

సాక్షి, హైదరాబాద్‌: తన కుమారుడు డ్రగ్స్‌ తీసుకున్న కేసులో అరెస్ట్‌ అయినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమన్నారు. మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో  ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఐదు రోజుల క్రితం ఇతరులతో కలిసి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లిన వారిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని.. అదే అనుమానంతో పోలీసులు గురువారం తెల్లవారుజామున వచ్చి టెస్ట్‌ చేయగా.. నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. అరెస్ట్‌ చేసినట్లు జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఊహజనిత వార్తలు ప్రసారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement