చుంచుపల్లి: కొత్తగూడెంలోని ఎంసీహెచ్‌లో చేరిన నిండు గర్భిణి బాత్‌రూమ్‌కు వెళ్లే క్రమాన ప్రసవించింది. దీంతో బిడ్డ జారి కింద పడగా.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని దమ్మపేటకు చెందిన గర్భిణికి నెలలు నిండడంతో బుధవారం కొత్తగూడెం ఎంసీహెచ్‌లో చేర్పించారు. ఈక్రమాన బెడ్ కేటాయించిన వైద్యులు... నొప్పులు వస్తే తమకు తెలిజేయాలని సూచించారు.
కాసేపటికి ఆమె బాత్ రూమ్‌కు వెళ్దామని నిలుచునే క్రమాన నొప్పులు రాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో కిందకు జారి పడింది. ఆ తర్వాత బ్లీడింగ్ అవుతుండడంతో ఆమె బంధువులు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేయగా సదరు గర్భిణి బెడ్ దిగుతుండగా నొప్పులు తెలియకుండానే డెలివరీ అయిందని.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, స్థానికులు, కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కొంతసేపు ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన
పురిటి నొప్పులతో వచ్చిన మహిళను పట్టించుకోని వైద్యులు
నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..కిందపడడంతో శిశువుకు తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ… pic.twitter.com/fcrgj0n6mq— Telugu Scribe (@TeluguScribe) July 16, 2026


