భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య | Software Engineer Dies By Suicide After Jumping From IT Office Building In Gachibowli | Sakshi
Sakshi News home page

భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Jul 16 2026 9:40 AM | Updated on Jul 16 2026 11:08 AM

Gachibowli Software Employee Incident Hyderabad

హైదరాబాద్‌: గచ్చిబౌలి ఐటీకారిడార్‌పరిధిలోని  నాలెడ్జి సిటీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం...ఏపీలోని నెల్లూరుకు చెందిన టి. అవినాష్‌ (40)కు జ్యోతితో వివాహం జరగ్గా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు నెలల క్రితమే బెంగళూరు కూకట్‌పల్లికి మకాం మార్చారు. నాలెడ్జి సిటీలోని క్వాల్‌కామ్‌ భవనంలోని హెచ్‌సీఎల్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆఫీస్‌ నుండి బయలుదేరుతున్నట్లు భార్యకు మెసేజ్‌ చేసిన అవినాష్‌, ఆ తర్వాత ఫోన్లు ఎత్తలేదు. ఆందోళన చెందిన భార్య సమాచారంతో ఆమె సోదరుడు అరుణ్‌కుమార్‌ రాత్రి 8.30 గంటలకు క్వాల్‌కామ్‌ భవనం వద్దకు వెళ్ళాడు. అక్కడ అవినాష్‌ 5వ అంతస్థు నుంచి కిందకు దూకి మృతిచెంది ఉండటం గమనించాడు. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement